ఇంటి  స్థలాలు ఇవ్వకపోతే కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం

ఇంటి  స్థలాలు ఇవ్వకపోతే కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం

భువనగిరి ఆగస్టు 08 (ముద్ర న్యూస్):- తహసిల్దార్ కార్యాలయం ముందు వందలాది మందితో ఇంటి స్థలాలు కావాలని ధర్నా చేయడం జరిగింది. సిపిఐ జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు, మంగళవారం భువనగిరి పురపాలక సంఘం పరిధిలోగల రెండు వేల మంది నిరుపేదలు ప్రభుత్వం నిర్ణయించిన అర్హుల జాబితా లోని లబ్ధిదారులందరికీ ఇంటి నివేశన స్థలాలు ఇండ్లు తక్షణమే మంజూరు చేయాలని. మంగళవారం తహసిల్దార్ కార్యాలయం ముందు వందలాది మందితో జరిగిన ధర్నాలో సిపిఐ జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ.డబుల్ బెడ్ రూమ్ ల కోసం భువనగిరి పట్టణంలో అర్జీలు పెట్టుకున్న వారందరికీ డబుల్ బెడ్ రూములు రాలేదని రెవెన్యూ అధికారులు విచారణ చేసి అర్హుల జాబితాను 2000 మందికి ఇంటి స్థలాలు ఇల్లు లేవని నిర్ణయించారు జాబితాను కూడా విడుదల చేశారని ఈ జాబితాలో పేర్లు ఉన్న వారందరికీ ఇంటి స్థలాలు ఇల్లు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని భువనగిరి పురపాలక సంఘ పరిధిలోని ప్రభుత్వ భూమి ఖాళీ స్థలాలు ఉన్నాయని భూములు ఎక్కడ ఉన్నాయో విచారణ జరిపి నిర్ధారించుకొని ప్రతి కుటుంబానికి 120 గజాల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు.శాసన  సభ ఎన్నికల ముందే లబ్ధిదారులకు కేటాయింపులు చేసే దాని కొరకు చర్యలు తీసుకోవాలని కోరారు లేని పక్షంలో నిరుపేదలు కలెక్టర్ కార్యాలయం ముట్టడి చేస్తారనిఅన్నారు.సిపిఐ జిల్లా పార్టీ కార్యాలయం నుండి వందలాది మందితో ప్రదర్శన నిర్వహించి తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం ధర్నా నిర్వహించడం జరిగింది.35 వార్డుల నుండి ప్రజలు తరలివచ్చారు.

సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఏశాల అశోక్ మాట్లాడుతూ పురపాలక సంఘ పరిధిలో ఇళ్ల స్థలాలు లేని వారికోసం విచారణ చేసి అర్హుల జాబితా ప్రకారంగానే పట్టాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిరుపేదలంతా నెలసరి అద్దె కిరాయిలు చెల్లించలేకపోతున్నారని వారు వారి కుటుంబాలను పోషించుకోలేని పరిస్థితిలో ఉన్నారని ప్రభుత్వ భూములు సరిపడా ఉన్నాయి, కాబట్టి అర్జీదారులందరికీ ఎలాంటి విచారణ లేకుండానే అర్హుల జాబితాను అనుసరించి స్థలాలు ఇల్లు మంజూరు చేయాలని కలెక్టర్  ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని కోరారు,ఈ ధర్నా కార్యక్రమంలో స్థలాలు లేని వారు తోపాటు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొల్లూరు రాజయ్య. మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు సోమన సబిత. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు వస్తువుల అభిలాష్. సిపిఐ పట్టణ కార్యదర్శి పుట్ట రమేష్. సహాయ కార్యదర్శి చింతల మల్లేశం. పట్టణ నాయకులు చింతల పెంటయ్య. బద్దం వెంకటరెడ్డి ముసునూరి వెంకటేశం మన్సూరి భాష ఏఐటీయూసీ నాయకులుతదితరులు పాల్గొన్నారు.