ప్రతి చివరి ధాన్యం గింజ కొనుగోలు చేస్తాం...

ప్రతి చివరి ధాన్యం గింజ కొనుగోలు చేస్తాం...
  • రైతులు వదంతులు నమ్మి ఆందోళన చెందవద్దు
  • గతంతో పోలిస్తే ఇప్పటికే రెండింతల ధాన్యం కొనుగోలు చేశాం: జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాష

ముద్ర ప్రతినిధి జగిత్యాల: జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లపై ప్రత్యేక దృష్టి సారించి వేగంగా  కొనుగోలు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాష ఒక ప్రకటన తెలిపారు. కల్లాలలో ఉన్న ప్రతి చివరి గింజను కొనుగోలు చేస్తామని సోషల్ మీడియా, వివిధ ప్రసార మంద్యామాల్లో  వచ్చే ప్రకటనలు చూసి రైతులు ఆందోళన చెందవద్దని కలెక్టర్ కోరారు. జిల్లాలో 144 ఐకెపి కేంద్రాలు 265 పిఎసిఎస్ కేంద్రాలు మొత్తం 409 కేంద్రాల  ద్వారా వరి ధాన్యం కొనుగోలు చేస్తున్నామని గత ఏడాది కంటే ఈ ఏడాది అదనంగా 45 కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలు చేస్తున్నట్టు తెలిపారు. జిల్లాలో ఉన్న 67 బాయిల్డ్ రైస్ మిల్లులకు 60 మాత్రమే పని చేస్తున్నావని 60 మిల్లులకు ధాన్యం కేటాయింపులు జరిగాయని సామర్థ్యానికి అనుగుణంగా 3,86,508 మెట్రిక్ టన్నుల దాన్యం కేటాయించినట్లు తెలిపారు. 19 మే వరకు 1,83,204 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కేటాయించి మిల్లులకు చేరవేసి బిల్లింగ్ ఆదేశించినట్లు తెలిపారు.

గతవారం అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కూడా జిల్లాలో కొనుగోలు చేశామని ప్రస్తుతం యాసంగి సీజన్లో మే 19 వరకు 2,05,555 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసి 1,83,204 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 60 బాయిల్ రైస్ మిల్లులకు  కేటాయించి ధాన్యం దిగుమతి చేశామన్నారు. గత సీజన్ లో ఈ తేదీ వరకు 1,07,428 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేశామని అందులో 90,429 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే దిగుమతి చేసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు.  ప్రస్తుత సీజన్లో గతంతో పోల్చుకుంటే రెండింతల ధాన్యాన్ని కొనుగోలు చేసి దిగుమతి చేసుకున్నట్లు పేర్కొన్నారు. 1122 లారీల ద్వారా రవాణా చేస్తున్నామని, ప్రతిరోజు 12000 నుంచి 14 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రవాణా చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు తాసిల్దారులు, ఆర్డీవోలు, పౌరసరపర సిబ్బంది, డి సి ఓ, డిఆర్డిఓ, వ్యవసాయ అధికారుల పర్యవేక్షణలో ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి రైస్ మిల్లులకు దిగుమతి అవుతుందని ఇందులో ఎలాంటి ఆలస్యం జరిగినా తగు చర్యలు తీసుకోవాలని ఇదివరకే ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.

రైతులకు ఏమైనా సమస్యలు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 1800 425 8187 ను సంప్రదిస్తే ఎప్పటికప్పుడు పరిష్కారం చూపబడనని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవసరమయ్యే మాయిచ్చర్ మిషన్, డిజిటల్ కాంటాలు, త్రాగునీరు, తార్పల్లిన్ కవర్లు ఏర్పాటు చేసి రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూస్తున్నామన్నారు. గత వారం రోజులుగా తీవ్ర ఉష్ణోగ్రతలు ఉన్నప్పటికీ కూలీలు, సెంటర్ల  ఇన్చార్జులు పనిచేసి రవాణాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నారని జిల్లాలో ప్రతి 5 మండలాలకు ఒక అధికారిని నియమించి పర్యవేక్షిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. అదనపు కలెక్టర్, అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది, మిల్లర్లు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు, సంబంధిత అధికారులతో ఎప్పటికప్పుడు సమావేశం నిర్వహిస్తూ ఇబ్బందులు తలెత్తకుండా తగు సూచనలు ఆదేశాలు జారీ చేస్తున్నట్లు తెలిపారు. జగిత్యాల జిల్లాలో ప్రతి సంవత్సరం అన్ని జిల్లాల కన్న ఆలస్యంగా కోతలు జరిగి జూన్ 2వ  వారం వరకు కొనుగోలు జరిగే ఆనవాయితీ ఉన్నదని కూలీలతో పాటు రైతులు కూడా సహకరించి సంచులు సిద్ధంగా ఉంచుకోవాలని కలెక్టర్ సూచించారు.