మంత్రి సీతక్క కు ఘనస్వాగతం

మంత్రి సీతక్క కు ఘనస్వాగతం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ఆదిలాబాద్ జిల్లా పార్లమెంటరీ ఇంఛార్జి, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతిరాజ్ ,మాతా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క కు ఘన స్వాగతం పలికారు .ఆదిలాబాద్ జిల్లా అధికారిక పర్యటనకు మొట్ట మొదటిసారిగా విచ్చేసిన  సందర్భంగా నిర్మల్ డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు మంత్రి సీతక్కను కలిసి శాలువా తో సన్మానించి పుష్పగుచ్ఛం  ఇచ్చారు.

మంత్రి సీతక్క  మహారాష్ట్ర నాగ్ పూర్ లో రేపు జరగబోయే అఖిల భారత కాంగ్రెస్ పార్టీ సమావేశపు ఏర్పాట్ల గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో శ్రీహరి రావు తో పాటు మామడ మండల నాయకులు రఫీ,మామడ మాజీ సర్పంచ్ బాపయ్య, నయనగారి మురళి,నగేష్ రెడ్డి తదితరులు ఉన్నారు.