సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలి:  వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్​ రెడ్డి 

సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలి:  వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్​ రెడ్డి 
  • అధికార ప్రతినిధిగా శ్రీధర్
  • ఎన్నికల సమన్వయకర్తగా ప్రమోద్ రెడ్డి

ముద్ర, వనపర్తి : అరవై యేళ్ళలో జరగని అభివృద్ధి తొమ్మిది యేళ్ళలో చేసి చూపించామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్​ రెడ్డి అన్నారు.  ఆదివారం ఎమ్మెల్యే క్యాంప్​ కార్యాలయంలో జిల్లా అధికార ప్రతినిధిగా వాకిటి శ్రీధర్, ​  నియోజకవర్గ ఎన్నికల సమన్వయ కర్తగా  వంగూరు ప్రమోద్​ రెడ్డిలను నియమించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దూర దృష్టితో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృధ్ధి చేసిన ఘనత  ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్​ రావుకే దక్కుతుందని అన్నారు. రైతుల సంక్షేమం కోసం రైతుబంధు, రైతు భీమా, వ్యవసాయానికి ఉచిత విద్యుత్​ తో పాటు  ప్రతి ఎకరాకు సాగునీరు, మిషన్​ భగీరథ, మిషన్​ కాకతీయ, నిరుపేద ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి, మైనార్టీలకు షాదీ ముబారక్, తదితర సంక్షేమ పథకాలు చేపట్టిన ​ ప్రభుత్వం బిఆర్​ఎస్​ అని, దేశంలో ఏ రాష్ర్టం ఇలాంటి అభివృధ్ధి సంక్షేమ పథకాలను చేపట్టలేదని ఆయన అన్నారు. పేదల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నదని, ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి పథకాన్ని వివరించవలసిన భాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని మంత్రి అన్నారు. 

విశ్వాసంతో పనిచేస్తా...
బిఆర్​ఎస్​ జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్​ 


నిత్యం ప్రజలలో ఉంటూ సేవ చేసే భాగ్యం  కల్పించి కౌన్సిలర్​ గా వరుసగా గెలిపించిన వనపర్తి ప్రజలు నన్ను ఈ స్థాయికి తీసుకరావడం జరిగిందని బిఆర్​ఎస్​ జిల్లా అధికార ప్రతినిథి వాకిటి శ్రీధర్​ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మంత్రి నిరంజన్​ రెడ్డి సహాకారంతో మున్సిపల్​ వైస్​ చైర్మన్​ గా పట్టణాభివృధ్ధికి కృషి చేస్తున్నానని ఆయన అన్నారు. ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్న రోడ్ల విస్తరణ పనులు దాదాపుగా పూర్తిగా కావస్తున్నాయని ఈ ఘనత మంత్రి నిరంజన్​ రెడ్డి కి దక్కుతుందని, ఈ పనులలో మేమంతా కలిసి పట్టణాభివృద్ధిలో  భాగ్యస్వాములమయ్యామని  అన్నారు. నా పై నమ్మకంతో జిల్లా అధికారం ప్రతినిధిగా నియమించినందుకు మంత్రి కృతజ్ఙతలు తెలుపుతూ, రాబోయే ఎన్నికలలో విశ్వాసంగా పనిచేసి గెలుపుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు. 

ప్రజా సేవే నా ధ్యేయం : ప్రమోద్ రెడ్డి


ప్రజలకు సేవ చేయడమే నా ధ్యేయంమని  నూతనంగా ఎంపికైన  నియోజకవర్గ ఎన్నికల సమన్వయ కర్త వంగూరు ప్రమోద్​ రెడ్డి అన్నారు. రాబోయే ఎన్నికలలో అందరిని సమన్వయం చేస్తూ మంత్రి నిరంజన్​ రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తామని ఆయనన్నారు. నియోజకవర్గంలోని ప్రతి బిఆర్​ఎస్​ కార్యకర్తను కలుస్తూ వారి యోగక్షేమాలను తెలుసుకుంటూ పార్టీ కోసం కృషి చేస్తామని ఆయన తెలిపారు. ప్రతి కార్యకర్తతో కలిసి మంత్రి నిరంజన్​ రెడ్డి చేసిన అభివృధ్ధిని ప్రజలలోకి తీసుకెళ్ళే విధంగా ముందుకు వెళ్తమని ఆయన అన్నారు. బిఆర్​ఎస్​ పార్టీ ప్రజాప్రతినిధులను, ఉద్యమకారులతో సమాలోచనలు చేసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆయన చెప్పారు. తనపై ఉంచిన భాధ్యతలకు విజయవంతంగా నెరవేర్చుతానని అన్నారు. తనపై విశ్వాసంతో ముఖ్యమైన పదవికి ఎంపిక చేసిన  మంత్రికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.