సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి

సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి

 బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అమర్నాథ్ రెడ్డి.

హుజూర్ నగర్, ముద్ర: ప్రభుత్వం మంజూరు చేసిన సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు చిట్యాల అమరనాథరెడ్డి కోరారు. మంగళవారం పట్టణంలోని పలు వార్డుల్లో సీఎంఆర్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదల ఆరోగ్య భరోసా నిమిత్తం ఏర్పాటు చేయబడిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు సీఎం సహాయ నిధి నుండి  హుజూర్నగర్  శాసనసభ్యులు శ్రీ శానంపూడి సైదిరెడ్డి  సహకారంతో వివిధ వార్డుల కు రూ. 1,94,500 విలువగల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఏ. నాగలక్ష్మి - రూ. 36,000, బి. సైదులు  - రూ. 60,000, షేక్. రహీమా - రూ. 27,000, డి. లక్ష్మీ - రూ. 32,000,షేక్. ఖాజాబీ - రూ. 26,000,ఆర్. గౌతమ్ - రూ. 13,500 లబ్ధిదారులకు అందజేయడం జరిగినది.
 ఈ సందర్భంగా బి ఆర్ ఎస్  పట్టణ పార్టీ అధ్యక్షులు చిట్యాల అమర్ నాథ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోనే మరెక్కడా లేని విధంగా  హుజూర్నగర్ నియోజకవర్గంలో   శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి గారి సహకారంతో ప్రతి నెల కోట్ల రూపాయలు విలువచేసే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను  పేద మధ్య తరగతి కుటుంబాల ఆరోగ్య స్థితిగతుల కొరకు అందజేయడం చాలా సంతోషంగా ఉందని, ఇంత గొప్ప కార్యక్రమం కేవలం బి ఆర్ ఎస్ పార్టీ మరియు విజన్ ఉన్న నాయకులు మన ముఖ్యమంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డిలకి మాత్రమే సాధ్యమవుతుందన్నారు.  స్థానిక ప్రజానీకo బిఆర్ ఎస్ ప్రభుత్వం శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి కారంతో
లబ్ధిదారులు మరియు వారి కుటుంబ సభ్యులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను తమ ఇంటి వద్దకే చేరవేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. 
 కార్యక్రమంలో హుజూర్నగర్ బి.ఆర్.ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అట్లూరి హరిబాబు గారు కౌన్సిలర్ లు కె. ఎల్. ఎన్ రావు,జక్కుల శంభయ్య, ములకలపల్లి రామ్ గోపి, అట్లూరి మంజుల హరిబాబు,మాజీ వార్డు కౌన్సిలర్ మీసాల కిరణ్ కుమార్, టిఆర్ఎస్ పట్టణ పార్టీ యువజన కమిటీ అధ్యక్షులు సోమ గాని ప్రదీప్ , శరత్,అధ్యక్షులు శీలం వీరయ్య, మెరుగ గురవయ్య, పెద్ది పుష్ప,బిఆర్ఎస్ పార్టీ నాయకులు నాగయ్య,  దయాకర్, షేక్ రహీం, కొరివి వీరయ్య, వెంకట్రావు, అంజయ్య, సైదులు, ఎల్ల బోయిన పుల్లయ్య,యువజన నాయకులు కోళ్లపూడి చంటి, మామిడి వసంత్, కస్తాల కృష్ణ, మెరుగు సాయి, కస్తాల రామకృష్ణ, షేక్ సయ్యద్,చెడపంగు గోపి, అఖిల్, దగ్గుపాటి రాజేష్, సోమపంగు రవీంద్ర ప్రజలు పాల్గొన్నారు.