సింగరేణిలో ఉద్యోగ నియామకాలు ఏవి: ప్రభుత్వాన్ని ప్రశ్నించిన భట్టి

సింగరేణిలో ఉద్యోగ నియామకాలు ఏవి: ప్రభుత్వాన్ని ప్రశ్నించిన భట్టి

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల : సింగరేణిలో ఉద్యోగుల రిటైర్మెంట్ తప్ప కొత్తగా ఉద్యోగ నియామకాలు జరగడం లేదని సీఎల్పీ భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం బెల్లంపల్లి లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భట్టి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అనంతరం ప్రభుత్వ శాఖలతో సింగరేణిలో ఉద్యోగ నియామకాలు జరుగుతాయని ఆశించిన నిరుద్యోగులకు నిరాశే  మిగిలిందని అన్నారు. సింగరేణిలో రిటైర్మెంట్ లు జరుగుతున్నా వారి స్థానంలో కొత్త వారికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం లేదని ఆయన విమర్శించారు.

బెల్లంపల్లి కి ఎమ్మెల్యేలు సింగరేణి స్థలాలను కబ్జా చేయడానికి వస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రజల అభివృద్ధి కోసం ఖర్చు చేయాల్సిన ప్రభుత్వ నిధులను ప్రయివేటు రియల్ ఎస్టేట్ వెంచర్లలో ఖర్చు చేయడం శోచనీయమని అన్నారు. బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది సంఖ్య పెంచకపోవడం ఆయన వైఫల్యం కు తార్కాణమని అన్నారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య విఫల ఎమ్మెల్యే నని ఆయన విమర్శించారు.  ఎమ్మెల్యే అసమర్థత వల్ల నియోజకవర్గం అభివృద్ధి చెందలేదని ఆయన అభియోగించారు.