బీఆరెస్ ప్రభుత్వాన్ని కూల్చితేనె తెలంగాణ కు భవిష్యత్ సీఎల్పీ భట్టి విక్రమార్క

బీఆరెస్ ప్రభుత్వాన్ని కూల్చితేనె తెలంగాణ కు భవిష్యత్  సీఎల్పీ భట్టి విక్రమార్క

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల : మాయమాటలు, గారడి చేష్టలతో  అధికారంలోకి వచ్చిన బిఆర్ఎస్ ప్రభుత్వంను  కూల్చివేస్తేనే తెలంగాణ కు బంగారు భవిష్యత్తు సాధ్యమని సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం పాదయాత్ర మంచిర్యాల జిల్లాలో ప్రవేశించింది. కాంగ్రెస్ శ్రేణులు ఘానా స్వాగతం పలికారు. తాండూరు లో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. నీళ్లు, నియామకాలు, ఆత్మగౌరవం  కోసం కోట్లాది తెచ్చుకున్న తెలంగాణ ను కేసీఆర్ ప్రభుత్వం ఆగం చేసిందని ఆయన విమర్శించారు. మూడు ఎకరాలు దళితులకు భూమి ఇస్తానన్న హామీ నీటిమూట గా మారిందని అన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న కేసీఆర్ ఊరుకో ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఆయన ఎద్దేవాచేశారు.

ఇల్లు లేదు, ఉద్యోగాలు లేవు, సాగునీరు, తాగునీరు లేదు ప్రజలకు ఏమి చేయని ప్రభుత్వం ప్రజా ధనాన్ని ఏమి చేసిందని ఆయన నిగ్గతీశారు. రుణమాఫీ చేస్తామని రైతులను కూడా వంచించాడని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మన ఉద్యోగాలు మనకే నినాదంతో ఉద్యోగాల నియామకాలు జరుపుతామని అన్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన పంటలకు పరిహారం, ఇల్లు నిర్మాణం కు ఐదు లక్షలు, 500 రూపాయలకే వంటగ్యాస్ ఇస్తామని భట్టి విక్రమార్క ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ , మదన్ మోహన్ రావు పాల్గొన్నారు.