గ్యాస్ రేట్లు  రాష్ట్రం ఎందుకు తగ్గించడం లేదు ? 

గ్యాస్ రేట్లు  రాష్ట్రం ఎందుకు తగ్గించడం లేదు ? 

ముద్ర ప్రతినిధి,  సూర్యాపేట:-కేంద్ర ప్రభుత్వం సాధారణ గ్యాస్ కు 200 రూపాయలు ఉజ్వల గ్యాస్ పై 400 రూపాయలు తగ్గించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అందుకు అనుగుణంగా రేట్లు ఎందుకు తగ్గించడం లేదని బీజేపీ  రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు ప్రశ్నించారు. గురువారం సూర్యాపేట మండలం ఎండ్లపల్లి గ్రామంలో కేంద్రం గ్యాస్ రేట్లను తగ్గించినందుకు ప్రధానమంత్రి మోడీ చిత్రపటానికి బీజేపీ మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు  సంగు గోవిందమ్మ ఆధ్వర్యంలో పాలాభిషేకం జరిగింది. ఈ సందర్భంగా సంకినేని మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశంలో గ్యాస్ లేని పేద కుటుంబాలకు  ప్రధానమంత్రి ఉజ్వల యోజన  ద్వారా  ఉచితంగా గ్యాస్ అందించారని అన్నారు.  ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ఆయిల్ రేట్లను బట్టి గ్యాస్ ధరల్లో పెరుగుదల , తగ్గుదల ఉంటుందన్నారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం ఇవేమీ పట్టనట్టు కేంద్ర ప్రభుత్వంపై బురద చల్లడానికి ప్రయత్నిస్తున్నాయన్నారు.