శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా..

శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా..

 ఆలయ కమిటీ ధర్మకర్తల ప్రమాణస్వీకారంలో ఎమ్మెల్యే

చిగురుమామిడి ముద్ర న్యూస్: చిగురుమామిడి మండలంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన సుందరగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హుస్నాబాద్ ఎమ్మెల్యే వోడితల సతీష్ కుమార్ అన్నారు. సుందరగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నూతన కమిటీ ధర్మకర్తల ప్రమాణ స్వీకారం  సోమవారం ఘనంగా జరిగింది. ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన ఎమ్మెల్యేకు ఆలయ అధికారులు కరీంనగర్ డివిజన్ ఇన్స్పెక్టర్ పాము సత్యనారాయణ,ఈవో కొండపర్తి రాజకుమార్,అర్చకులు శేషం సత్యనారాయణ చార్యులు, శేషం శ్రీనివాసచార్యులు, సముద్రాల శ్రీనివాసచార్యులు,శేషం నవీన్ చార్యులు,శేషం నరసింహచార్యులు పూర్ణకుంభంతో  ఘన స్వాగతం పలకగా ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడుతూ శ్రీవెంకటేశ్వర స్వామి గుట్టపైకి ఘాట్ రోడ్డు నిర్మాణం కోసం, ఆలయ పునర్నిర్మాణం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం స్థపతులను పంపించవలసిందిగా టీటీడీ వారిని కోరతానని, ఆలయం వద్ద ఫంక్షన్ హాల్ నిర్మాణం కోసం నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.

అనంతరం  ఆలయ కమిటీ చైర్మన్ గందె సంపత్,ధర్మకర్తలు యజమాలతో ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొత్త వినిత శ్రీనివాస్ రెడ్డి, జెడ్పిటిసి సభ్యుడు గీకురు రవీందర్, ఫ్యాక్స్ చైర్మన్ రమణారెడ్డి, సర్పంచ్ శ్రీమూర్తి రమేష్, ఎంపీటీసీ మెడబోయిన తిరుపతి, సర్పంచులు సన్నీల వెంకటేష్, బోయిని శ్రీనివాస్,  వైస్ ఎంపీపీ బేతి రాజిరెడ్డి, సింగిల్ విండో వైస్ చైర్మన్ కరివేద మహేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్పర్సన్ రామోజు రజిత కృష్ణమాచారి, జిల్లా రైసస సభ్యులు సాంబారి కొమురయ్య, మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య,ఆలయ జూనియర్ అసిస్టెంట్ బూట్ల కవిత శ్రీనివాస్, ఉపసర్పంచ్ జంగా శ్రీనివాస్ రెడ్డి,అన్నాడి మల్లికార్జున్ రెడ్డి,ఆలయ డైరెక్టర్లు తాళ్లపల్లి కిరణ్ కుమార్ గౌడ్,గుండెకారి మాధవ్,బొల్లం వెంకటలక్ష్మి, కనకయ్య,మంతెన మహేష్, బోల్లబత్తిని మహేష్, నాయకులు పెసరి రాజేశం, రాంబాబు, సర్వర్ పాషా, దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.