జిల్లాలో చురుకుగా సాగుతున్న కాంగ్రెస్ పార్టీ మహిళా డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం
- మహిళా డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మహిళలు చురుగ్గా పాల్గొనాలి
- సూర్యాపేట జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తిరుమల ప్రగడ అనురాధ కిషన్ రావు
తుంగతుర్తి ముద్ర :- కాంగ్రెస్ పార్టీ మహిళా డిజిటల్ సభ్యత్వ నమోదు లో సూర్యాపేట జిల్లా ముందు వరుస లో ఉందని ఆ పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు తిరుమల ప్రగడ అనురాధ కిషన్ రావు అన్నారు. గురువారం మండల పరిధిలోని కొత్తగూడెం లో డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ మాట్లాడుతూ జాతీయ మహిళా కమిటీ అధ్యక్షురాలు అల్కలాంబ రాష్ట్ర మహిళా కమిటీ అధ్యక్షురాలు సునీతా రావు ఆదేశాల మేరకు మహిళా కాంగ్రెస్ మెంబర్షిప్ డ్రైవ్ ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సభ్యత్వ నమోదుకు విశేష స్పందన లభిస్తుందని, ప్రతి కార్యకర్త సభ్యత్వం స్వీకరించాలని పేర్కొన్నారు.
పార్టీ బలోపేతానికి సభ్యత్వ నమోదు కార్యక్రమం వారది. ఉపయోగపడుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ప్రియాంక గాంధీ ఆశయాలను, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమం అద్భుతమైన వేదికగా నిలుస్తుందని సూచించారు. రానున్న స్థానిక సంస్థలు ఎన్నికల నేపథ్యంలో కార్యకర్తలు రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగాలని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు దగ్గర చేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అందుకు గతంలో ఉన్న సభ్యత్వాలను రెన్యువల్ చేస్తూ కొత్తవారిని చేర్చుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాండవుల పద్మ , సుగుణమ్మ ,పూలమ్మ గీత తదితరులు పాల్గొన్నారు