డెయిరీ మిల్క్ చాక్లెట్‌లో బతికున్న పురుగు..!

డెయిరీ మిల్క్ చాక్లెట్‌లో బతికున్న పురుగు..!

ముద్ర,హైదరాబాద్:- హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి నగరంలోని అమీర్ పెట్ మెట్రో స్టేషన్‌లో క్యాడ్‌బరీ డైరీ మిల్క్ చాక్లెట్ కొనుగోలు చేశాడు. కవర్ ను కట్ చేసి తిందామని చూశాడు. అంతలో ఊహించని షాక్ ఎదురైంది. చాక్లెట్ లో ప్రాణాలతో, పాకుతున్న పురుగును గమనించాడు. వెంటనే జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశాడు.

డెయిరీ మిల్క్ చాకట్ లో పురుగులు ఉండటం పట్ల సూపర్ మార్కెట్ యాజమాన్యాన్ని, క్యాడ్బరీ ప్రశ్నించారు. గడువు తీరిన ఈ ఉత్పత్తులకు క్వాలిటీ చెక్ ఉందా? ప్రజారోగ్య ప్రమాదాలకు ఎవరు బాధ్యత వహిస్తారు? అని రాబిన్ నిలదీశారు. ఈ పోస్ట్ కు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, క్యాడ్బరీ డెయిరీ మిల్క్, రత్నదీప్ సూపర్ మార్కెట్ ను ట్యాగ్ చేస్తూ, తన కొనుగోలు బిల్లు ఫొటోను షేర్ చేశారు.