ఓటర్ల వయస్సు123 ఏళ్లు

ఓటర్ల వయస్సు123 ఏళ్లు
  • తప్పుల తడకగా ఓటర్ల జాబితా...!

ముద్ర, షాద్ నగర్: ఎన్నికల సంఘం విడుదల చేసిన ఓటర్ల జాబితా తప్పుల తడకగా మారింది. ఎన్నికల సంఘం నుంచి విడుదలైన తుది ఓటర్ల జాబితాలో తప్పులు దొర్లై. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం వ జనవరి 6 న ముసాయిదా  ఓటర్ల జాబితా ను  విడుదల చేశారు తుది జాబితా ప్రకటించారు రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలానికి సంబంధించిన జాబితాలో తప్పులు ఉన్నట్లు గుర్తించారు చాలామంది పుట్టిన తేదీలను అధికారులు  తప్పుగా నమోదు చేశారు.

సుమారు 2,071 మంది ఓటర్ల పుట్టిన తేదీని 01.01.1900  గా నమోదు చేశారు అయితే జాబితాలో ఓటరు పేరు పోలింగ్ బూత్ నెంబర్లు ఇంటి నెంబరు వంటి వివరాలు సరిగానే ఉన్న ఒక్కొక్కరు వయసు 123 ఏళ్లగా నమోదు చేశారు. ఈ జాబితాను పరిశీలించిన ఓటర్లు వెంటనే బిఎల్ఓ లకు ఫిర్యాదు చేశారు. స్పందించిన అధికారులు ఓటర్ల నుంచి ఆధార్ కార్డులు సేకరించి ఫారం 8 ద్వారా సవరణకు చర్యలు చేపట్టారు..