బ్రేకింగ్ న్యూస్... మరికాసేపట్లో ముఖ్యమంత్రి పదవికి వైఎస్ జగన్ రాజీనామా....

బ్రేకింగ్ న్యూస్... మరికాసేపట్లో ముఖ్యమంత్రి పదవికి వైఎస్ జగన్ రాజీనామా....

ముద్ర,ఆంధ్రప్రదేశ్:- ముఖ్యమంత్రి పదవికి వైఎస్ జగన్ రాజీనామా చేయనున్నారు. మారికాసేపట్లో ఆయన రాజ్‌భవన్ కు చేరుకోనున్నారు. గవర్నర్ కు తన రాజీనామాను జగన్ సమర్పించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో దారుణ ఓటమి దిశగా వైసీపీ పయనిస్తున్న దిశలో ఆయన రాజీనామాకు సిద్ధమయ్యారు. ఇందుకోసం గవర్నర్ అబ్దుల్ నజీర్ అపాయింట్‌మెంట్ కోరారు. 

గవర్నర్ అపాయింట్‌మెంట్ ఖరారయిన వెంటనే రాజ్‌భవన్ కు వెళ్లి ముఖ్యమంత్రి పదవికి రాజీనామాలేఖను సమర్పించనున్నారు. ప్రజల తీర్పును గౌరవిస్తూ జగన్ రాజ్‌భవన్ కు మరికాసేపట్లో చేరుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. తదుపరి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి వీలుగా తన రాజీనామా లేఖను గవర్నర్ కు సమర్పించనున్నారు.