చంద్రగ్రహణం కారణంగా నేడు సాయంత్రం 4 గంటలకు యాదాద్రి ఆలయం మూసివేత

చంద్రగ్రహణం కారణంగా నేడు సాయంత్రం 4 గంటలకు యాదాద్రి ఆలయం మూసివేత

ముద్ర, యాదగిరిగుట్ట న్యూస్ :పాక్షిక చంద్రగ్రహణం కారణంగా శనివారం సాయంత్రం 4 గంటలకు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం ఉపాలయాలు అనుబంధాల ఆలయాలన్నీ మూసివేనున్నట్లు ఈవో గీత తెలిపారు శనివారం అర్ధ రాత్రి ఒంటిగంట ఐదు నిమిషములకు గ్రహణం ప్రారంభమై రెండు గంటల 22 నిమిషములకు ముగుస్తుందని ఈ కారణంగా ఆలయాలను మూసివేస్తున్నట్లు వివరించారు. మరిసటి రోజు ఆదివారం 29వ తేదీ యధావిధిగా ఏకకాలంలో పుష్కరిణి శుద్ధ ఆలయాల సంప్రోక్షణ గ్రహణ సంబంధ శుద్ధి పూర్తిచేసిన అనంతరం సుప్రభాత కార్యక్రమాలు జరుగుతాయన్నారు. శనివారం 28వ తేదీన మధ్యాహ్నం ఒంటిగంట వరకు యధావిధిగా  నిత్య కార్యక్రమాలు జరుగుతాయని అరిగింపు అనంతరం మూడు గంటల వరకు భక్తులకు దర్శన సదుపాయాలు కల్పించి మూడు గంటల నుండి నాలుగు గంటల వరకు ఆరాధన అర్చన ఆరగింపు శయనోత్సవ కార్యక్రమాలు పూర్తిచేసి ద్వారా బంధనం చేయనున్నట్లు చెప్పారు. 28వ, తేదీ చంద్రగ్రహణం కారణంగా శరత్ పూర్ణిమ కార్యక్రమమును 27వ తేదీ శుక్రవారం రోజు రాత్రి 7 గంటల నుండి నివేదన వరకు శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవ కళ్యాణం మండపం నందు నిర్వహించబడుతుందన్నారు.