కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి యువతి ఆత్మహత్యాయత్నం

కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి యువతి ఆత్మహత్యాయత్నం
  • కాపాడిన ట్రాఫిక్ పోలీసులు

ముద్ర వార్తలు, హైదరాబాద్: హైదరాబాద్‌లోని దుర్గంచెరువు కేబుల్‌ బ్రిడ్జి పైనుంచి దూకి ఓ యువతి సోమవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే స్పందించిన పోలీసులు ఆమెను రక్షించారు. వంతెనపై యువతి అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో ట్రాఫిక్ పోలీసులు అలెర్ట్ అయ్యారు. చెరువులోకి దూకే ప్రయత్నం చేస్తుండగా ట్రాఫిక్ పోలీసులు అడ్డుకుని ఆమెను కాపాడారు. ఆ యువతి నిద్ర మాత్రలు తీసుకున్నట్లు గుర్తించారు. చికిత్స కోసం ఆమెను ఓ ప్రైవేట్ ఆస్పత్తికి పోలీసులు తరలించారు. ఆమె ఎవరు? ఎందువల్ల ఈ అఘాయిత్యానికి పాల్పడేందుకు సిద్ధమయ్యిందన్న వివరాలు తెలియాల్సివుంది.