ఆరు గ్యారెంటీల అమలు తోనే పేదల జీవితాల్లో వెలుగులు 

ఆరు గ్యారెంటీల అమలు తోనే పేదల జీవితాల్లో వెలుగులు 
  • యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందే మోహన్ 

ముద్ర/షాద్ నగర: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలతోనే పేద ప్రజల జీవితాల్లో వెలుగులు వీర జిమ్ముతాయని యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందే మోహన్ అన్నారు. బుధవారం షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని 14, 15 వార్డులలో కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి భారీ ప్రచారం చేపట్టారు. ఇంటింటికి తిరిగి వంశీ చంద్ రెడ్డికి సంబంధించిన ప్రచార కరపత్రాలను అందజేశారు.

సందర్భంగా అందే మోహన్ మాట్లాడుతూ మే13న జరిగే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి మద్దతు తెలుపడంతో పాటు ప్రతి ఒక్కరు చేతి గుర్తుకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉంటే పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందే అవకాశం ఉందని అన్నారు. మహిళలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీపై ఆదరణ చూపి ఓటు వేసి గెలిపించాలని, కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే దేశంలో పేదల కుటుంబాలు బాగుపడతాయని అందేమోహన్ అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన కారు గ్యారంటీలను ప్రణాళికబద్ధంగా అమలుచేసి తీగ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతామని వివరించారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.