వేర్వేరు దొంగతనం కేసులో యువకుని రిమాండ్

వేర్వేరు దొంగతనం కేసులో యువకుని రిమాండ్
  • దుర్గమ్మ గుడిలో దొంగతనం, ఐఓబి బ్యాంకు ఎటిఎం ధ్వంసం 
  • ఎస్సై రమాకాంత్

ముద్ర,ఎల్లారెడ్డిపేట :వేరువేరు దొంగతనాలకు పాల్పడిన యువకునికి జ్యుడీషియల్ రిమాండ్ విధించి జైలుకు పంపారు. ఎల్లారెడ్డిపేట ఎస్సై రమాకాంత్ వివరాల ప్రకారం  స్థానిక దుర్గమ్మ గుడి తాళం  ఈనెల 16న  పగులగొట్టి ఉండిలో ఉన్న నగదును  గుర్తుతెలియని దుండగుడు  తస్కరించాడని మండల కేంద్రానికి చెందిన నేవూరి శ్రీనివాస్ రెడ్డి అదేవిదంగా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ఏటీఎం ధ్వంసం చేశారని బ్యాంకు మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీసీ ఫుటేజ్ లను పరిశీలించి వేములవాడ మండలం నాంపల్లి గ్రామానికి చెందిన అంకం బాలకృష్ణ 26ను గుర్తించామని తన కుటుంబం గత కొంత కాలం నుండి ఎల్లారెడ్డిపేటలో నివసిస్తున్నట్లు ఎస్సై రమాకాంత్  పేర్కొన్నారు. నిందితున్ని  పట్టుకొని విచారణ చేయగా పై రెండు దొంగతనాలకు తనే పాల్పడినట్లు ఒప్పుకోవడంతో కేసు నమోదు చేసి సిరిసిల్ల కోర్టుకు తరలించగా నిందితునికి జ్యూడిషియల్ రిమాండు విధించి కరీంనగర్ జైలుకు తరలించారని తెలిపారు.దొంగతనాలకు పాల్పడితే కఠినమైన శిక్షలు విధించి జైలుకు పంపడం జరుగుతుందని ఎస్సై రమాకాంత్ హెచ్చరించారు.