యువత గంజాయికి బానిస కావొద్దు రామన్నపేటలో ఎస్ ఐ చిరంజీవి అవగాహన సదస్సు

యువత గంజాయికి బానిస కావొద్దు రామన్నపేటలో ఎస్ ఐ చిరంజీవి అవగాహన సదస్సు

ముద్ర, మల్యాల: మండలంలోని రామన్నపేట గ్రామంలో మంగళవారం రాత్రి మల్యాల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో యువతా మేలుకో.. గంజాయి మానుకో... అనే అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా హాజరైన గ్రామంలోని యువత, పెద్దలకు ఎస్ ఐ చిరంజీవి గంజాయి పట్ల జరిగే అనర్థాలను వివరించారు. యువత గంజాయి వంటి వ్యాసనాలకు బానిసై, తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని పేర్కొన్నారు. ఎవరైనా గంజాయి విక్రయించిన, వినియోగించిన తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు.