పార్లమెంటులో  గెలుపు ఖాయం - షాద్ నగర్ ఎమ్మెల్యే "వీర్లపల్లి శంకర్" 

పార్లమెంటులో  గెలుపు ఖాయం - షాద్ నగర్ ఎమ్మెల్యే "వీర్లపల్లి శంకర్" 
  • అందె మోహన్ ఆద్వర్యంలో యువజన కాంగ్రెస్ డోర్ టు డోర్ ప్రచారం పోస్టర్ల విడుదల

 ముద్ర, షాద్ నగర్: కాంగ్రెస్‌ పార్టీ ప్రవేశపెట్టిన గ్యారెంటీ పథకాలు పేద ప్రజల సంక్షేమానికి బాట అని బాట అని షాద్ నగర్ ఎమ్మెల్యే "వీర్లపల్లి శంకర్" అన్నారు. త్వరలో జరగబోయే  ఎన్నికల్లో పార్లమెంటు ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ పక్కాగా గెలుస్తుందని ఎమ్మెల్యే అన్నారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో యువజన కాంగ్రెస్ నాయకులు అందే మోహన్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారానికి సంబంధించిన పోస్టర్లను స్థానిక నేతలతో కలిసి విడుదల చేశారు. రాబోయే ఎన్నికల్లో గడప గడపకు కాంగ్రెస్‌ కార్యక్రమం నిర్వహించాలని పేర్కోన్నారు.  కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోకు అదనంగా కాంగ్రెస్‌ అమలు చేయబోయే ప్రణాళికను ప్రజల ముందుకు మరోసారి తీసుకువెళ్లేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

పెరిగిన బడ్జెట్‌కు అనుగుణంగా చేయూత పథకం కింద రూ.4 వేల పెన్షన్‌ ఇస్తామని, గృహ జ్యోతి కింద ప్రతి నెల 200 యూనిట్లు ఉచితంగా విద్యుత్‌ను అందిస్తామని పేర్కొన్నారు. ఉన్నత విద్య కోసం ప్రభుత్వం నుంచి ఉచితంగా రూ.15 లక్షల ఆర్థిక సహాయం, కాంగ్రెస్‌ గ్యారెంటీ పథకాలను కార్యకర్తలు ప్రతి ఇంటికి చేరవేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఇంటింటికి వచ్చే యువజన కాంగ్రెస్ కార్యకర్తలు ఇంట్లో ఎవరెవరికి ఏ పథకాలు అందుతున్నాయో ఉద్యోగస్తులు ఎంతమంది ఉన్నారు నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు ప్రతి వివరాలు అడిగి తెలుసుకుంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందేమోహన్ మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు శక్తివంచన లేకుండా ప్రయత్నం చేస్తున్నట్లు వివరించారు..నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ సయ్యద్ ఖదీర్, మహమ్మద్ అలీ ఖాన్ బాబర్, బాలరాజ్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు..