యువశక్తి ఫౌండేషన్ సేవలు అద్భుతం

యువశక్తి ఫౌండేషన్ సేవలు అద్భుతం
  • రాష్ట్రవ్యాప్తంగా ఫౌండేషన్ సేవలు అద్భుతం -ఎమ్మెల్యే మెగారెడ్డి

ముద్ర.వనపర్తి:- యువశక్తి ఫౌండేషన్ సేవలు అద్భుతం అని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేగా రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో  ఎమ్మెల్యే తుడిమేగా రెడ్డి  యువశక్తి ఫౌండేషన్ క్యాలెండర్ మరియు లోగోను ఆవిష్కరించారు.రాష్ట్రవ్యాప్తంగా యువశక్తి ఫౌండేషన్ చేస్తున్నటువంటి సేవలను  నిత్యం తను మీడియాలో ప్రత్యక్షంగా చూస్తున్నానని, యువశక్తి ఫౌండేషన్ సేవలు అద్భుతం అని అభినందించారు.

ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కాగితాల మధు మాట్లాడుతూ నియోజకవర్గానికి సంబంధించి చాలామందికి రక్తదానంతో పాటు పేద విద్యార్థులకు చదువుకు అండగా నిలిచామని ఎమ్మెల్యే కు వివరించారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి యువశక్తి ఫౌండేషన్ కు తన సహకారం ఎల్లవేళలా ఉంటుందని భరోసానిచ్చారు.కార్యక్రమంలో ,ఫౌండేషన్ స్టేట్ ప్రధానకార్యదర్శి వగ్గం ప్రేమ్,స్టేట్ ప్రెసిడెంట్ గోబ్బురు నవీన్, ఫౌండేషన్ స్టేట్ ప్రధాన కార్యదర్శి రవికుమార్ ,వైస్ ప్రెసిడెంట్ ప్రేమ్ కుమార్,గణేష్, శంకర్,జిల్లా ప్రధాన కార్యదర్శి శివ కృష్ణ , వైస్ ప్రెసిడెంట్ చందు, వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్ బాలకృష్ణ తదితరులు ఉన్నారు.