జెడ్పి సీఈవో ఆకస్మిక తనిఖీ

జెడ్పి సీఈవో ఆకస్మిక తనిఖీ

ముద్ర.వీపనగండ్ల:-గ్రామాలలో పారిశుద్ధ్య నివారణ, హరితహారం మొక్కలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని వనపర్తి జెడ్పీ సీఈవో యాదయ్య అన్నారు. శుక్రవారం వీపనగండ్ల మండల పరిషత్ కార్యాలయాన్ని ఆకస్మికంగా  తనిఖీ చేసి పలు రికార్డులను పరిశీలించారు. గ్రామాలలో పారిశుద్ధ్య నివారణ చర్యలు చేపట్టాలని, ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతుండటంతో హరితహారం లో నాటిన మొక్కలు ఎండిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, హరితహారం లో నర్సరీలో పెరుగుతున్న మొక్కల పట్ల శ్రద్ధ తీసుకునేలా పంచాయతీ కార్యదర్శులకు సూచించాలని ఎంపీడీవో శ్రీనివాసరావుకు జెడ్పి సీఈవో సూచించారు. వనపర్తి జిల్లా జడ్పీ సీఈఓ గా బాధ్యతలు చేపట్టిన అనంతరం మొదటిసారిగా మండలానికి వచ్చిన జెడ్పిసిఓ యాదయ్యకు ఎంపీడీవో శ్రీనివాసరావు,పి.ఆర్.ఏ.ఈ  మెహర్ తేజ,సూపరిండెంట్ రవినారాయణ,ఉపాధి హామీ ఎ.పి. ఓ శేఖర్ గౌడ్, జూనియర్ అసిస్టెంట్ శ్రీకాంత్, కంప్యూటర్ ఆపరేటర్ అమీర్ శాలువా కప్పి సన్మానం చేశారు.