ఆడబిడ్డలకు అన్న మన సీఎం కేసీఆర్

ఆడబిడ్డలకు అన్న మన సీఎం కేసీఆర్
  • కల్వచర్లలో ప్రజా ఆశీర్వాద యాత్రలో దసరా చీరల పంపిణీలో జడ్పీ చైర్మన్ పుట్ట మధు

ముద్ర ప్రతినిధి,పెద్దపల్లి:- తెలంగాణ లో ఆడబిడ్డలకు అన్న,  మన సీఎం కేసీఆర్ అని పెద్దపెల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ అన్నారు. బుధవారం ఉదయం రామగిరి మండలం కలవచర్ల గ్రామంలో కొనసాగుతున్న ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా దసరా పండుగకు ప్రభుత్వం అందిస్తున్న చీరలను ఆయన ఆడబిడ్డలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ తెలంగాణ వచ్చాక మన పండుగలను ఎంతో ఘనంగా జరుపుకుంటున్నామని,  కుల మతాలకు అతీతంగా ఆడబిడ్డలకు తెలంగాణ ప్రభుత్వం చీరలు అందిస్తుందని అన్నారు.  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అంత అవినీతి జరుగుతుందని గతంలో వారు అధికారులు ఉన్నప్పుడు ముఖ్యమంత్రులను ఎప్పుడు మారుస్తారో తెలవకుంట ఉండెదన్నారు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ కొత్త కొత్త పథకాలు తీసుకువచ్చి ప్రజలను మాయ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రజలు మోసపోకుండా మళ్లీ ముచ్చటగా మూడోసారి మన సీఎం గా కేసీఆర్ ను సీఎం  చేయాలని కోరారు. ప్రజలు తనను ఆశీర్వదిస్తున్నారని ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందుతానన్నారు. ఈ ఆశీర్వాద యాత్రలో టీబీజీకేఎస్ నాయకులు కెంగర్ల మల్లయ్య, ఏఎంసీ చైర్మన్ దాసరి రాయలింగు జడ్పిటిసి మేదరవేన శారద కుమార్ యాదవ్,  బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శేంకేషి రవీందర్ సర్పంచ్ లు గంట పద్మరమణరెడ్డి, ఎండీ మంజూర్ అహ్మద్. టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.