కోదాడలో చెలరేగిన అసమ్మతిని యుగంధర్ రావు తనకు అనుకూలంగా మార్చుకోనున్నారా? 

కోదాడలో చెలరేగిన అసమ్మతిని యుగంధర్ రావు తనకు అనుకూలంగా మార్చుకోనున్నారా? 
  • వివాదరహితుడిగా పేరు ఉన్న యుగంధర్ రావు పేరును కోదాడకు అధిష్టానం సూచించనుందా?

తుంగతుర్తి ముద్ర:-తుంగతుర్తి మండల జడ్పిటిసిగా గెలుపొంది జిల్లా మంత్రితో పాటు జిల్లాలోని ఎమ్మెల్యేల చొరవ తో జిల్లా పరిషత్ పీఠం దక్కించుకున్న జడ్పీ చైర్ పర్సన్ గుజ్జ దీపిక యుగంధర్ రావు  అచిర  కాలంలోనే జిల్లా వ్యాప్తంగా మంచి పేరు సంపాదించారు. ముఖ్యంగా జడ్పీ చైర్పర్సన్ భర్త గుజ్జ యుగంధర్ రావు వివాద రహితుడిగా విపక్ష పార్టీలు సైతం విమర్శలకు తావు లేకుండా జిల్లా లో వివాద రహితునీగా  ముద్ర వేసుకున్నారు. గత కొంతకాలంగా గుజ్జ యుగంధర్ రావు కోదాడ అసెంబ్లీ నుండి పోటీ చేస్తారనే ఊహగానాలు చెలరేగాయి. కోదాడ సిట్టింగ్ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కు వ్యతిరేకంగా కోదాడ బిఆర్ఎస్ సీనియర్ నాయకులు మెజార్టీ ఎంపిపిలు, సర్పంచ్ లు, ఎంపీటీసీలు ఉండటం వీరంతా గుజ్జ యుగంధర్ రావుతో మంచి సంబంధాలు కలిగి ఉండడం తో కోదాడ లో యుగంధర్ రావు పోటీ చేస్తారనే మాటలు బలపడ్డాయి.

కోదాడ అసమతి నేతలు సైతం బొల్లం మల్లయ్య యాదవ్ కాకుండా వేరే ఎవరైనా కలిసి పనిచేస్తామని స్థాయిలో అసమ్మతి గళం వినిపిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కోదాడ అభ్యర్థి ప్రకటన వెలువడిన 24 గంటల్లోపే అసమ్మతి తీవ్రస్థాయిలో బగ్గుమనడం, కోదాడ, హైదరాబాద్లో అసమ్మతి సమావేశాలు జోరుగా ఊపందుకున్నాయి .మరి ముఖ్యంగా ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ ఒకటి రెండు రోజుల క్రితం సీనియర్ రాజకీయం నేత మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావును మర్యాదపూర్వకంగా కలవడానికి వెళ్లగా చేదు అనుభవంతో వేను తిరగాల్సి వచ్చిందనేది గమనార్హం. కనీసం ఎమ్మెల్యేను కలవడానికి కూడా చందర్రావు ఇష్టపడడం లేదంటే పరిస్థితి ఏ మేరకు వ్యతిరేకంగా ఉందో ఆలోచించవచ్చు. కోదాడ అసమ్మతి వాదాన్ని యుగంధర్ రావు తనకు అనుకూలంగా మలుచుకుంటారా? బిఆర్ఎస్ అధిష్టానంతో మంచి సంబంధాలు కలిగి ఉన్న యుగంధర్ రావు తనకు అనుకూలంగా పావులు కదుపుతున్నట్లు సమాచారం .రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో సత్సంబంధాలు ఉన్న యుగంధర్ రావు తనకున్న పారిశ్రామిక రంగ అనుభవంతో గతంలో  కేటీఆర్ అభిమానాన్ని చురగోన్నారు .అంతేగాక ఎలాంటి మచ్చ లేకుండా జిల్లా పరిషత్ చైర్మన్గా కొనసాగుతూనే పలుమార్లు జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి ,తుంగతుర్తి ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ లతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ నుకలిసి గుర్తింపు పొందారు. అటు ముఖ్యమంత్రి కేసీఆర్, ఇటు కేటీఆర్ ఆశీస్సులతో ఆశీస్సులతో యుగంధర్ రావు కోదాడ బరిలో దిగడానికి వ్యూహం రూపొందిస్తున్నారని తెలుస్తోంది .అందులో భాగంగా ఇప్పటికే అసమ్మతి వినిపిస్తున్న నాయకులను సంప్రదించినట్లు వార్తలు వేలువడుతున్నాయి .కోదాడ అసమ్మతి యుగంధర్ రావు కు అనుకూలంగా మారితే టికెట్ ఖాయం అనే మాట వినవస్తోంది. కోదాడ అసమ్మతి పై ముఖ్యమంత్రి కెసిఆర్ ,పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల స్పందన ఎలా ఉంటుందో? అలాగే అసమ్మతి తగ్గడానికి అభ్యర్థిని మారుస్తారా ?లేక అసమ్మతి నేతల నుఏమైనా బుజ్జ గిస్తారా? లేక యుగంధర్ రావు కు టికెట్ ఇస్తారా? వేచి చూడాల్సిందే.....