ప్రజాపతినిధులను అగౌరపరిచిన మునుగోడు ఎంపీడీవో రాపర్తి భాస్కర్

ప్రజాపతినిధులను అగౌరపరిచిన మునుగోడు ఎంపీడీవో రాపర్తి భాస్కర్
  • అధికారి తీరుపై ప్రశ్నించిన జడ్పిటిసి
  • మహిళా ప్రజాప్రతినిధి అనే గౌరవం లేకుండా సమావేశం నుండి మహిళ జడ్పిటిసిని కూడా వెళ్లిపోమన్న వైనం...
  • ఎంపీడీవో ఎంపీడీవో రాపర్తి భాస్కర్ తీరుపై మండిపడ్డ ప్రజాప్రతినిధులు
  • క్షమాపణ చెప్పాలని ధర్నాకు దిగిన జడ్పిటిసి, సర్పంచులు, ఎంపీటీసీ లు
  • మరో విషయం ఏంటంటే ఈయన గారికి కుల పిచ్చి ఎక్కువేనట
  • తమ సామాజిక వర్గానికి ప్రియారిటీతోపాటు వారికే పనులు చేయడం గమనర్హం
  • కుల పిచ్చి అధికారి మునుగోడు మండలంలో పనిచేయడం దురదృష్టకరమని ప్రజలు ఆవేదన
  • జిల్లా అధికారులు ఎంపీడీవో భాస్కర్ పై తగిన చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాలని కోరుతున్నారు

ముద్ర ప్రతినిధి, నల్గొండ:ప్రజా ప్రతినిధులను అగౌరవపరుస్తూ మాట్లాడిన ఎంపీడీవో రాపర్తి భాస్కర్ ను వెంటనే సస్పెండ్ చేయాలని జిల్లా సాంఘిక సంక్షేమ స్థాయి సంఘం అధ్యక్షులు, మునుగోడు జడ్పిటిసి నారబోయిన స్వరూప రాణి రవి కోరారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో సభ ప్రారంభ సమయంలో సర్పంచుల సమస్యలను సభ దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రజా ప్రతినిధులు మైక్ ఇవ్వమని అధికారులను కోరడంతో మునుగోడు ఎంపీడీవో ఆర్.భాస్కర్ మునుగోడు సర్పంచు మిర్యాల వెంకన్నను  యు నాన్సెన్స్ గెటవుట్ అని అనడంతో మునుగోడు జెడ్పిటిసి నారాబోయిన స్వరూప రాణి కలగజేసుకొని ప్రజా ప్రతినిధులను గౌరవించకుండా అసభ్య పదాలను వాడటం ఏంటని ప్రశ్నించే ప్రశ్నించారు. ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులకు సమాధానం చెప్పాల్సిన అధికారి ప్రజాప్రతిలను అగౌరపరచడం ఏంటని ప్రశ్నించడంతో అవసరమైతే నువ్వు కూడా వెళ్ళిపో అని మహిళ ప్రజా ప్రతినిధి జడ్పిటిసిని అనడంతో ఒక్కసారిగా సభ సమావేశం ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో ఆగ్రహానికి గురైన జడ్పిటిసి సర్పంచులు, ఎంపీటీసీలు సమావేశ మందిరాన్ని వాకౌట్ చేసి ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నాకు దిగారు.

ప్రజా ప్రతినిధులు సమావేశ మందిరం నుండి బయటకు వస్తుండగా వెళ్లిపోయిన పర్వాలేదు. నేను 18 ఏళ్లుగా ప్రభుత్వ అధికారిగా పనిచేస్తున్నాను నాకేమీ భయం లేదు అంటూ అనడంతో అందులో ఉన్న అధికారులు, ప్రజా ప్రతినిధులు  ఆశ్చర్యానికి గురయ్యారు. సమావేశమును నిర్వహించేందుకు ఎంపీపీ కర్నాటి స్వామి యాదవ్ ప్రజా ప్రతినిధులను ఆహ్వానించినప్పటికీ ప్రజా ప్రతినిధులను అగౌరపరిచిన ఎంపీడీవో క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారి తీరులో మార్పు రాకపోవడంతో సమావేశానికి హాజరుకాకుండా ప్రజాప్రతినిధులు తిరిగి ఇంటి బాట పట్టారు. అధికారి తీరుపై జిల్లా అధికారులకు ఫిర్యాదు చేస్తామని ప్రజాప్రతినిదు హెచ్చరించారు. మరో విషయం ఏంటంటే ఎంపీడీవో భాస్కర్ ఆయన సామాజిక వర్గానికి చెందిన వారికే ప్రయారిటీ ఇవ్వడం గమనార్హం... కేవలం ఆయన సామాజిక వర్గానికి పని చేస్తున్నారని మండల వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, ప్రజల నుండి ఇంతకు ముందు నుండే గుసగుసలు వినిపిస్తున్నాయి. అధికారి ప్రతి ఒక్కరికి పని చేయాల్సింది పోయి ఆయన సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇలాంటి అధికారి మునుగోడు మండలంలో పనిచేయడం దురదృష్టకరమని ప్రజలు చెప్తున్నారు వెంటనే సస్పెండ్ చేయాలని జిల్లా అధికారులను కోరుతున్నారు.