Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో ఏఐ ఆథారిత డిజిటల్​ విద్య 

  • విద్యా ప్రమాణాల పెంపునకు సర్కారు కసరత్తు 
  • నందన్​ నీలేకని, ఈఎన్​ స్టెఫ్​ ఫౌండేషన్​ సేవలు వినియోగం
  • పాఠశాల విద్యలో విప్లవాత్మక మార్పులు 
  • అభ్యాసన పద్దతిలో సాంకేతిక ప్రమాణాలు పెంపు
  • బెంగళూరులో రాష్ట్ర పాఠశాల అధికారుల బృందం పర్యటన

ముద్ర, తెలంగాణ బ్యూరో : పాఠశాల విద్యా ప్రమాణాల పెంపుపై రాష్ట్ర సర్కార్​ ఫోకస్​ చేసింది. ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ ను పూర్తి స్థాయిలో ఉపయోగించడం ద్వారా రాష్ట్రంలో పాఠశాల విద్యలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టేందుకు సన్నద్ధమవుతున్నది. సీఎం రేవంత్ రెడ్డి మార్గదర్శకంలో పాఠశాల విద్యను మరింత నాణ్యతా ప్రమాణాలతో అందించేందుకు ఆర్టిఫిషల్ ఇంటిలిజెన్స్ (ఏ.ఐ )డిజిటల్ ఇనీషియేటివ్స్ లను పాఠశాల విద్య శాఖ పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. విద్యార్థుల్లో మరింత మెరుగైన అభ్యాస పద్దతులు,సాంకేతిక ప్రమాణాలను పెంపొందించడం లాంటి వినూత్న కార్యక్రమాలను ప్రవేశ పెట్టనుంది. ఇందులో భాగంగా.. బెంగుళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఎక్ స్టెప్ -ఫౌండేషన్ ను రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి డా.యోగితా రాణా నేతృత్వంలో ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం గురువారం అక్కడికి చేరుకున్నది.

ఈ క్రమంలో ఆ ఫౌండేషన్ ప్రతినిధులతో భేటీ అయిన తెలంగాణ విద్యా శాఖ ప్రతినిధి బృందం విద్యారంగంలో చేపట్టాల్సిన ఇన్షియేటివ్ లపై చర్చించింది. కాగా విద్యా రంగంలో డిజిటల్ పద్దతులను ప్రవేశపెట్టడం ద్వారా విద్యార్థుల్లో విద్యా పరమైన నాణ్యతా ప్రమాణాలను పెంపొందించడంలో ఎక్ స్టెప్- ఫౌండేషన్ అగ్రగామిగా ఉంది. ఎక్ స్టెప్- ఫౌండేషన్ – విజనరీ టెక్నోక్రాట్, ఫిలాంత్రపిస్ట్, ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ అయినా నందన్ నీలేకని ఈ ఎక్ స్టెప్-ఫౌండేషన్ కు కో-ఫౌండర్ గా ఉన్నారు. విద్యా, వైద్యం, వ్యవసాయ రంగాల్లో డిజిటల్ పద్దతులను ప్రవేశపెట్టి మరింత మెరుగైన సేవలను అందించడానికి ఈ  ఎక్ స్టెప్- ఫౌండేషన్ ప్రారంభించారు. ఈ ఫౌండేషన్ ఇప్పటికే గుజరాత్, కర్ణాటక, ఒడిస్సా, పంజాబ్, తమిళనాడు రాష్ట్రాలలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో కలసి పనిచేస్తోంది.ఫౌండషనల్ లిటరసీ,న్యూమెరసీ మెళకువలో ప్రాథమిక విద్యా స్థాయిలో ఆర్టిఫిషల్ ఇంటిలిజెన్స్ ఆధారిత డిజిటల్ పద్ధతుల ద్వారా ప్రాథమిక స్థాయిలో రాయడం,చదవడం,సంఖ్యా పరమైన విజ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చని రాష్ట్ర బృందం తెలుసుకున్నది. అలాగే ఏ.ఐ ఆధారిత టూల్స్, ప్లాటుఫామ్ లను ప్రవేశ పెట్టడం ద్వారా విద్యార్థుల్లో వ్యక్తిగత స్థాయిలో విద్యా ప్రమాణాలు, అభ్యాస పద్ధతులు మరింతగా మెరుగుపర్చవచ్చని తెలుసుకున్నది.

డాటా, డ్రైవెన్​ ఇన్​ సైట్​ లో పద్దతిలో విద్యార్థుల్లో ఉన్న అభ్యసన లోపాలను గుర్తించి, వాటి ని సవరించడానికి తగు ఇనిషియేటివ్ లని ప్రవేశ పెట్టొచ్చని నిర్ధారణకు వచ్చింది. దీంతో పాటు ఉపాధ్యాయుల్లో వృత్తిపరమైన ప్రమాణాలను పెంపొందించేందుకు పాఠశాల గదుల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా ఉపయోగించడానికి ఉపాధ్యాయులకు డిజిటల్ పద్దతులపై పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చింది. ఇదీలావుంటే 2024 లో కేరళ రాష్ట్రాన్నిసందర్శించిన రాష్ట్ర విద్యా శాఖ ప్రతినిధి బృందం అక్కడి విద్యా రంగంలో చేపట్టిన ఆధునిక పద్దతులను పరిశీలించింది. కేరళ ప్రభుత్వం కూడా తన రాష్ట్ర విద్యా శాఖలో ఏ.ఐ టూల్స్ లను పూర్తిస్థాయిలో వినియోగించుకొని మెరుగైన విద్యా ప్రమాణాలను సాధించిందని ఈ బృందం తన పరిశీలనలో గుర్తించింది. ఈ బెస్ట్ ప్రాక్టీసులను కూడా తెలంగాణా విద్యా శాఖలో ప్రవేశపెట్టాలని  నిర్ణయించింది. తాజాగా ఎక్ స్టెప్ -ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఈ ఏ.ఐ ఆధారిత విద్యను ప్రవేశ పెట్టడానికి తెలంగాణ సమగ్ర ప్రణాళికను రూపొందిస్తోంది. డిజిటల్ ఇనీటిటివ్స్,ప్రాథమిక స్థాయిలో అభ్యసన నైపుణ్యాల పెంపు, విద్యార్థులు, ఉపాధ్యాయులకు స్నేహపూర్వక అభ్యసన పద్ధతుల్లో సహాయం అందించడం రంగాల్లో ఈ ప్రణాళిక ను రూపొందిస్తుంది. బెంగళూరులో పర్యటించిన ప్రతినిధి బృందంలో రాష్ట్ర ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ కమీషనర్ కృష్ణ ఆదిత్య, పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ ఈవీ నర్సింహా రెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్లు ఉమా హారతి, గరిమ ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.