ఆశ కార్యకర్తల మానవ హారం - రాస్తా రోకో

ఆశ కార్యకర్తల మానవ హారం - రాస్తా రోకో

ముద్ర ప్రతినిధి, నిర్మల్: గత కొన్ని రోజులుగా ఆశ కార్యకర్తలు తమ సమస్యల పరిష్కారం కోరుతూ చేపట్టిన సమ్మె రోజురోజుకు ఉధృతం అవుతోంది. తమ నిరసనలో భాగంగా శుక్రవారం స్థానిక ఆర్డీవో కార్యాలయం ఎదుట జాతీయ రహదారిపై మానవ హారం గా ఏర్పడ్డారు. రాస్తారోకో నిర్వహించారు. దీంతో రహదారికి ఇరువైపులా వందలాది వాహనాలు అరగంటకు పైగా నిలిచి పోయాయి. ఫలితంగా ప్రయాణికులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. చివరికి పోలీసులు రంగ ప్రవేశం చేసి నచ్చజెప్పారు. దీంతో తమ నిరసన విరమించారు.