బోట్​ఫెస్టివల్​లో ప్రమాదం

బోట్​ఫెస్టివల్​లో ప్రమాదం
  • 31 మంది దుర్మరణం, ఏడుగురికి గాయాలు

చైనా: బోట్ ఫెస్టివల్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకొని 31 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ దుర్ఘటన చైనాలోని బార్బిక్యూ రెస్టారెంట్​లో బుధవారం అర్థరాత్రి చోటు చేసుకోగా, గురువారం ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో ప్రసారం అవుతోంది. కిచెన్‌లోని గ్యాస్ లీక్ కావడంతోనే పేలుడు సంభవించినట్లు అధికార వర్గాలు గుర్తించాయి. ఈ ప్రమాదంలో మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయని అధికారులు పేర్కొన్నారు. పేలుడు కారణంగా రెస్టారెంట్ అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక బృందం అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. డజనకుపైగా అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పుతున్న ఫుటేజ్‌ను సీసీటీవీలో కనిపిస్తుంది. మూడు రోజుల డ్రాగన్ బోట్ ఫెస్టివల్ సెలవుల సందర్భంగా చైనాలో చాలా మంది తమ బంధువులు, స్నేహితులతో కలిసి రెస్టారెంట్‌కు వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందజేయాలని అధికారులకు సూచించారు. ‘గాయపడిన వారికి చికిత్స చేయడంలో అన్ని విధాలుగా కృషి చేయాలని, ప్రజల ప్రాణాలు, ఆస్తులను సమర్థవంతంగా రక్షించడానికి కీలకమైన రంగాలలో భద్రతా పర్యవేక్షణ, నిర్వహణను బలోపేతం చేయాలని ఆదేశించారు.