ఆటో డ్రైవర్లకు ప్రమాద భీమా వర్తింప చేయాలి

ఆటో డ్రైవర్లకు ప్రమాద భీమా వర్తింప చేయాలి

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల : ప్రపంచ ఆటో డ్రైవర్ల దినోత్సవం వేడుకలను మంచిర్యాలలో ఘనంగా నిర్వహించారు. మంగళవారం మంచిర్యాల లోని ఆటో స్టాండ్ ల వద్ద ఆటో డ్రైవర్ల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు, మున్సిపల్ వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్ కేక్ కట్ చేసి సంబరాలు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆటో డ్రైవర్ల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. ప్రమాదకరమైన జీవితాన్ని గడుపుతున్న ఆటో డ్రైవర్లకు ఆర్ధికంగా చేయుతనిచ్చే పథకాలు అమలు చేయాలని కోరారు.  ప్రమాదంలో మృతి చెందిన వారికి, గాయపడి అంగవైకల్యం చెందిన వారికి పది లక్షలు పరిహారంగా చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.  రైతు బంధు పథకంలా ఆటో బందు పథకం ప్రవేశపెట్టి ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆటో డ్రైవర్ల సంఘం అధ్యక్షుడు పుట్ట మధు ,పట్టణాధ్యక్షుడు రాజ్ కుమార్ సభ్యులు  పాల్గొన్నారు.