కాలుష్య కంపెనీలపై చర్యలు తీసుకోవాలి

కాలుష్య కంపెనీలపై చర్యలు తీసుకోవాలి

ముద్ర ప్రతినిధి, మెదక్: కాలుష్య కంపనీలపై చర్యలు తీసుకోవాలని జెడ్పి స్థాయి సంఘ సమావేశంలో సభ్యులు లేవనెత్తారు. శనివారం మెదక్ జిల్లా పరిషత్ చైర్పర్సన్  హేమలత శేఖర్ గౌడ్ అధ్యక్షతన గ్రామీణ అభివృద్ధి, పంచాయతీ రాజ్, ఆర్టీసీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, గనులు భూగర్బ గనుల శాఖ, క్రీడలు శాఖలపై స్థాయి సంఘ సమావేశం నిర్వహించారు.  పెన్షన్ లు, రంగాయిపల్లి ఎమ్మెస్ అగర్వాల్ కంపనీ కాలుష్యంపైన, శంకరంపేట్ రాధ స్టీల్ కంపనీలపై చర్యలు తీసుకోవాలని సభ్యులు డిమాండ్ చేశారు. నర్సాపూర్ నుండి గోమరం- పరికిబండ మీదుగా ప్రత్యేక బస్ ఏర్పాటు చేయాలి కోరారు. పారిశుధ్య కార్మికులకు వేతనాలు సమయానికి రాకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారని ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అక్రమ మట్టి రవాణా జోరుగా సాగుతున్నందున చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయా అంశాలపై చర్చించారు.  ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈవో వెంకట శైలేష్, డిప్యూటీ సీఈఓ సుభాషిణి, శంకరంపేట్  జడ్పీటీసీ మాధవి రాజు, చేగుంట జెడ్పీటీసీ శ్రీనివాస్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.