ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలి

ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలి

భూదాన్ పోచంపల్లి, ముద్ర; భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రంలోని నేతాజీ చౌరస్తాలో ఆరు లైన్ల స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఎన్ ఎస్ యు ఐ జిల్లా కార్యదర్శి రావుల అనిల్ అన్నారు. బుధవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ కోమటిరెడ్డి నరసింహారెడ్డికి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలో 17వేల పైచిలుకు జనాభా ఉందని, రోజు రోజుకు వాణిజ్య, వస్త్ర  వ్యాపార దుకాణాలు పెరుగుతుండడంతో పట్టణంలో వాహనాల రద్దీ పెరిగి మూల మలుపుల వద్ద ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అన్నారు. ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకొని తక్షణమే నేతాజీ చౌరస్తా లో ఇరువైపులా ఆరు లైన్ల స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో భువనగిరి యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ జనరల్ సెక్రెటరీ చేరాల సుధీర్ , యాదగిరి, మహేష్, అరుణ్, సురేష్  తదితరులు పాల్గొన్నారు.