పారదర్శక పాలనకు చిరునామా తెలంగాణ - ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు

పారదర్శక పాలనకు చిరునామా తెలంగాణ - ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు

ముద్ర, లక్షేట్టిపేట :  దేశంలోనే పారదర్శక పాలనకు చిరునామా గా తెలంగాణ నిలిచిందని ఎమ్మెల్యే దివాకర్ రావు అన్నారు. గురువారం మండలంలోని సూరారం, జెండా వెంకటపూర్, కొత్తూరు గ్రామ పంచాయతీ నూతన భవనాలకు స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ  సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..... తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తోందన్నారు. అవినీతి, అక్రమాలకు తావు లేకుండా పారదర్శకంగా పాలన అందిస్తున్న ఘనత ప్రభుత్వానికి దక్కిందన్నారు. ముఖ్యంగా స్థానిక సంస్థలను బలోపేతం చేస్తూ గ్రామ పంచాయతీ భవనాలకు రూ.20 లక్షల చొప్పున కేటాయించడం మరువలేమన్నారు. గ్రామాల్లో మౌళిక సదుపాయాలు కల్పిస్తూ ప్రజలకు అండగా నిలిచామన్నారు. ప్రజలు సీఎం కేసీఆర్ కు అండగా ఉండి వచ్చే ఎన్నికల్లో బీ ఆర్ ఎస్ ను గెలిపించాలని కోరారు. అంతకుముందు కొత్తూర్ సర్పంచ్ సొల్లు సురేష్ మాట్లాడుతూ.. సీఎం కెసిఆర్ దళితబంధు, ఆసరా, కల్యాణలక్ష్మి, బీసీ బంధు, వికలాంగుల పెన్షన్ లు పెంచి దేశానికి ఆదర్శoగా నిలిచాడన్నారు. ఎమ్మెల్యే దివాకర్ రావు సహకారంతో కొత్తూర్ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ తిప్పని లింగన్న, ఎంపిడిఓ నాగేశ్వర్ రెడ్డి, మాజీ డీసీఎంఎస్ శ్రీనివాస్ రెడ్డి, బి ఆర్ ఎస్ గ్రామ కమిటీ చైర్మన్ రమేష్, ఉపసర్పంచ్, వార్డ్ సభ్యులు, నాయకులు తిరుపతి తదితరులు పాల్గొన్నారు.