అక్క పెళ్లి గ్రామానికి చెందిన యువకులు బిజెపిలో చేరిక

అక్క పెళ్లి గ్రామానికి చెందిన యువకులు బిజెపిలో చేరిక

ముద్ర, ప్రతినిధి ఎల్లారెడ్డిపేట రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అక్క పెళ్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్,కాంగ్రెస్ పార్టీలకు చెందిన కొందరు యువకులు కరీంనగర్లోని భారతీయ జనతా పార్టీ జాతీయ ఎంపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సమక్షంలో యువకులు భారీగా చేరారు.ఆదివారం బండి సంజయ్ అధ్వర్యంలో అక్కపల్లి గ్రామానికి చెందిన 30 మంది యువకులు భారతీయ జనతా పార్టీ లో చేరగా భాజపా కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.

భాజాపా లో చేరిన వారిలో వరుకుటి రాజు కాంగ్రెస్ సీనియర్ నాయకులు (వార్డు సభ్యులు) నేదురి నాగరాజు, నేదూరి నవీన్ కొంపెల్లి ఆనంద్ నెదురి సతీష్ బత్తుల బాబు సంటి సాయి కుమార్ మందటి బాల మల్లేష్, శివ, వినయ్,హౌస్,భరత్,తదితరులు చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అవినీతి పాలనపై విరక్తి చెంది భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను మెచ్చి తెలంగాణ పై మోడీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై పార్టీ లో చేరడం జరిగింది అన్నారు.ఈ కార్యక్రమం లో బీజేపీ మండల అధ్యక్షుడు పొన్నాల తిరుపతి రెడ్డి,బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షుడు వర్కుటి శ్రీనివాస్,సీనియర్ నాయకులు కొప్పుల కరుణాకర్,చల్ల నరేష్ రెడ్డి, మందాటి ఆంజనేయులు, పెండ్యాల శివ,ఎర్ర అజయ్ కుమార్,చల్ల సాయికుమార్, మందాటీ శివసాయి,బల్యాల భరత్ తదితర నాయకులు పాల్గొన్నారు.