పొలింగ్ కు సర్వం సిద్ధం

పొలింగ్ కు సర్వం సిద్ధం

ముద్ర ప్రతినిధి భువనగిరి : నేడు జరిగే సాధారణకు పొలింగ్ కు సర్వం సిద్ధం చేసినట్లు, ఎన్నికలకు సంబంధించి పోలింగ్ స్టేషనులకు ఈవీఎంలు, సామగ్రి తరలించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ హనుమంతు కే. జండగే తెలిపారు. ఆదివారం ఆలేరు ఇండోర్ స్టేడియంలో భువనగిరి, ఆలేరు నియోజక వర్గాలకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలలో పోలింగ్ సామాగ్రిని  సిబ్బందికి అందజేశారు.  పోలింగ్ అధికారులు వివి ప్యాట్, బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్లను, పోలింగ్ సామాగ్రిని చెక్ చేసుకోవాలన్నారు. 13 న ఉదయం 7 గంటలకు  పోలింగ్ ప్రారంభించాలని  అన్నారు.


ఉదయం 7 నుండి సాయంత్రం ఆరు గంటల వరకు జరిగే పోలింగ్లో ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఓటర్లు ఏపిక్ కార్డు అందని  పక్షంలో 12 రకాల గుర్తింపు కార్డులలో ఏదో ఒకటి తీసుకుని పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు.  మొత్తం పోలైన ఓట్లు ప్రతి రెండు గంటలకు ఒకసారి రిపోర్ట్ ఇవ్వాలని ఎలాంటి  సమస్య లు రాకుండా ఎన్నికలు సజావుగా  జరిగేలా చూడాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ పోలీస్ కమిషనర్  రాజేష్ చంద్ర, అధికారులు పాల్గొన్నారు.