మేదర మఠం, గుడి  కోసం జాగా కేటాయించండి సారు 

మేదర మఠం, గుడి  కోసం జాగా కేటాయించండి సారు 

మంత్రిని కలిసి విన్నవించుకున్న జిల్లా మేదర సంఘం

సిద్దిపేట, ముద్ర ప్రతినిధి: సిద్దిపేట జిల్లాలో ఉన్న 500 కుటుంబాల కోసం కుల దేవత గుడి నిర్మాణము, మఠం నిర్మాణం కోసం స్థలాన్ని కేటాయించాలని రాష్ట్ర ఆర్థిక,వైద్య ఆరోగ్యశాఖ మంత్రి  తన్నీరు హరీష్ రావును కలిసి మేధర కులస్తులు విజ్ఞప్తి చేశారు.

వెదురు బుట్టలు వెదురు కట్టెలు అమ్ముకుంటూ కుటుంబాలని పోషించుకునే మేదర మహేంద్ర కులస్తులు సిద్దిపేట జిల్లాలో మంత్రికి ఇచ్చిన వినతిపత్రంలో 500 కుటుంబాలు ఉన్నాయని జిల్లా నేతలు తెలిపారు ఆదివారం రాత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు మేదర కులస్తుల ఆరాధ్య దైవము కులదైవమైన కంకాలమ్మ కేతేశ్వర స్వామి దేవాలయము మేదరమటమును సిద్దిపేటలో ఏర్పాటు చేసుకోవాలని తీర్మానించినామని దానికి అవసరమైన స్థలాన్ని ప్రభుత్వం ద్వారా కేటాయించాలని వారు మంత్రిని కోరారు తెలంగాణ రాష్ట్రంలోనే మేదర మఠము దేవాలయము ఒక్క ఆదిలాబాద్ జిల్లా కౌటాలలో ఇప్పటివరకు ఉందని అటువంటి కులదైవాన్ని మఠాన్ని సిద్దిపేటలో నిలుపుకొని పూజలు చేయాలని ఐదు వందల కుటుంబాలు నిర్ణయించాయన్నారు మేదర కులస్తుల విజ్ఞప్తిని సావధానంగా విన్న మంత్రి హరీష్ రావు వెంటనే ఆదేశాలు కలెక్టర్కు జారీ చేశారు