వాహనాల తనిఖీల్లో  90,300/- రూపాయలు  సీజ్

వాహనాల తనిఖీల్లో  90,300/- రూపాయలు  సీజ్

ముద్ర,వనపర్తి: పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున వనపర్తి జిల్లా ఎస్పీ రక్షిత కె  మూర్తి,ఆదేశాల మేరకు పోలీసులు వనపర్తి జిల్లా పరిధిలో వాహనాల తనిఖీ చేపట్టారు. వాహనాల తనిఖీల్లో భాగంగా పెబ్బేరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్నూల్ బైపాస్ రోడ్డు  చెక్ పోస్ట్ దగ్గర వాహనల తనిఖీ నిర్వహిస్తుండగా ఒక వ్యక్తి కర్నూలు నుండి వీపనగండ్ల కు కారులో నంబర్ AP 31 SV 7136 దానిలో 90,300/-  రూపాయలు ఉండగా అట్టి రూపాయలకు ఎలాంటి అనుమతి పత్రాలు లేనందున సీజ్ చేయడం జరిగింది ని పెబ్బేరు ఎస్ ఐ తెలిపారు.ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున వనపర్తి జిల్లా పరిధిలో ఎవరైన 50వేల రూపాయల కొద్దీ ఎక్కువ డబ్బులను తీసుకువెళ్లరాదని ఒక వేళ తీసుకెళ్తే రసీదు, తగిన పత్రాలు  వాటి వివరాలు ఉండాలని అన్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టడానికి డబ్బులు, మద్యం, ఇతర విలువైన వస్తువులు తీసుకెళ్లారాధని ఎస్సై వివరించారు