పచ్చని యజ్ఞానికి పదేండ్లు

పచ్చని యజ్ఞానికి పదేండ్లు
  • దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హరితహారం కార్యక్రమం
  • ప్రభుత్వ పాఠశాలl ఆవరణలో మొక్కలు నాటిన జిల్లా కో ఆప్షన్

గుండాల ,ముద్ర న్యూస్:-యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హరితహార కార్యక్రమాన్ని పురస్కరించుకొని స్థానిక ప్రభుత్వ పాఠశాలలో జిల్లా కోఆప్షన్ ఎండి ఖలీల్ ముఖ్య అతిథిగా,పాల్గొని మొక్కలని నాటారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. తెలంగాణలో హరిత ప్రగతి పదేళ్లకు చేరుకుందని తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో,ఒకసారి ఆత్మ వలోకనం చేసుకుంటే రాష్ట్రంలో ప్రత్యేక అస్తిత్వం కోసం ఆరాటపడిన తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాతే ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు పునర్నిర్మాణ ఏ జెండాను సిద్ధం చేసుకుందని ఇన్నేళ్లుగా నాటిన మొక్కలు చెట్లుగా మారి ఆక్సిజన్ తో పాటు ఆహ్లాదాన్ని,పంచుతున్నాయని హరిత తెలంగాణ సాధనలో ప్రభుత్వ సంకల్పం ప్రజల భాగస్వామమే పచ్చని విజయానికి సాక్షిగా నిలిచిందని రాష్ట్రమంతటా పచ్చదనం విరివియాలంటే  తెలంగాణకు హరితహారం నిరంతరం ప్రక్రియల కొనసాగాలని తెలంగాణ లోనీ,అన్ని  గ్రామాలు పచ్చగా ఉండాలని,ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ హరిత హార కార్యక్రమాన్ని మొదలుపెట్టారని అన్నారు.ఈ కార్యక్రమంలో,ఎంపీపీ తాండరామ్రావతి,ఎంపీడీవో శ్రీనివాసులు స్థానిక సర్పంచ్ చిందం వరలక్ష్మి ప్రకాష్ ఎంపిటిసి కుంచాల సుశీల అంజిరెడ్డి పంచాయతీ కార్యదర్శి రమేష్ ఫీల్డ్ ఆఫీసర్ నవనీత,అంగన్వాడీ టీచర్లు గ్రామస్తులు పాల్గొన్నారు.