రెండు రాష్ట్రాల్లో కొనసాగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్​

రెండు రాష్ట్రాల్లో కొనసాగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్​

ఈశాన్య భారత్‌లోని మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్దకు ఓటర్లు బారులు తీరారు. రెండు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 118 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. మేఘాలయ రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో బంగ్లాదేశ్, అస్సాంతో కూడిన సరిహద్దును అధికారులు మూసివేశారు.  ఆ ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లోకి తెచ్చారు. బంగ్లాదేశ్‌తో మేఘాలయ అంతర్జాతీయ సరిహద్దు కలిగి ఉంది. అంతేకాక అస్సాంతో రాష్ట్ర సరిహద్దును కలిగిఉంది. ఈ రెండు సరిహద్దులను మూసివేసినట్లు మేఘాలయ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఎఫ్ఆర్ ఖార్కోంగోర్ చెప్పారు. నాగాలాండ్ బీజేపీ చీఫ్ టెంజెన్ ఇమ్నా అలంగ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.  తను పోలింగ్ కేంద్రానికి వెళ్లిన  వీడియోను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు.