కూసుకుంట్ల గెలుపు కోసం సైనికులా పనిచేయాలి - ఎత్తపు మధుసూదన్ రావు

కూసుకుంట్ల గెలుపు కోసం సైనికులా పనిచేయాలి - ఎత్తపు మధుసూదన్ రావు

చండూరు, ముద్ర: కూసుకుంట్ల గెలుపు కోసం ప్రతి కార్యకర్త సైనికులా పనిచేయాలని బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఎత్తపు మధుసూదన్ రావు అన్నారు. ఆదివారంచండూరు మండల పరిధిలోనితుమ్మలపల్లి గ్రామంలోబిఆర్ఎస్ పార్టీ కార్యాలయంఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలనుప్రజలకు వివరిస్తూ,ప్రతి ఇంటింటికి తిరిగిఅందరం కలిసికట్టుగాపనిచేయాలనివారు కార్యకర్తలకు పిలుపునిచ్చారు.బంగారు తెలంగాణ దిశగారాష్ట్రాన్ని అన్నిరంగాల్లోఅభివృద్ధి చేస్తూ,దేశంలోనేఏ రాష్ట్రంలో లేనిసంక్షేమ పథకాలుతెలంగాణ రాష్ట్రంలోముఖ్యమంత్రి కెసిఆర్ ప్రవేశపెట్టారని వారు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలురైతుబంధు,రైతు బీమా,దళిత బంధు,బీసీ బందుఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ,రాష్ట్రాన్ని అన్ని  రంగాల్లోనూఅభివృద్ధి చేశాడనివారు అన్నారు. దేశవ్యాప్తంగా రైతు రుణమాఫీ చేసిన ఏకైక ముఖ్యమంత్రి కెసిఆర్ అని, రైతు రుణమాఫీ 14 వేల కోట్లు ఖర్చు చేశారని, మిగిలిన రుణమాఫీ కూడా వారం పది రోజులలో రుణమాఫీ చేస్తారనివారు అన్నారు.ముఖ్యంగా రైతులకు24 గంటల కరెంటుఅందించిన ముఖ్యమంత్రికెసిఆర్ అనివారు అన్నారు.కేంద్ర ప్రభుత్వంధాన్యాన్ని కొనకపోతే ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల కోసం ప్రతి గింజను కొని రైతుల ఎకౌంట్లోకి డబ్బులు పంపిన ఏకైక నాయకుడు కెసిఆర్ అనివారు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన కొత్త మేనిఫెస్టోతో ప్రతిపక్షాలకు చమటలు పడుతున్నాయని వారు అన్నారు. సౌభాగ్య లక్ష్మిపథకం కిందరేషన్ కార్డు ఉన్నప్రతి మహిళాకు3000 చొప్పున ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందనివారు తెలిపారు.ఆరోగ్యశ్రీనిఐదు లక్షల నుంచి 15 లక్షల వరకు పెంచామని అన్నారు. రైతుబంధు పథకాన్ని 16,000 చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిందనివారు ఈ సందర్భంగా తెలియజేశారు.పేద ప్రజలకు ఎల్లప్పుడూకెసిఆర్ అండగా ఉంటారని,  వచ్చే ఎన్నికలలోకారు గుర్తుకు ఓటు వేసి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారుఅన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల పార్టీ ఉపాధ్యక్షులుకురుపాటి సుదర్శన్, నరేందర్ రావు,గ్రామ శాఖ అధ్యక్షులులక్ష్మణ్ యూత్ అధ్యక్షులుముక్కం రాజు, నరేష్,తీగల వెంకన్న, అద్దంకి కిరణ్ కృష్ణయ్య,, జక్కలి రాములు,  రవి,శ్రీను,వెంకటయ్య,గంగ చెన్నకేశవులు, గంగ శ్రీకాంత్, పంతులు బిక్షం, ఏసోబు,  సురేష్ తదితరులు పాల్గొన్నారు.