చైన్ స్నాచింగ్ కు యత్నం

చైన్ స్నాచింగ్ కు యత్నం

ముద్ర,రాయికల్ : రాయికల్ శివారు లోని జనమాయి చెరువు వద్ద ఒంటరిగా బట్టలు ఉతుకుతున్న ఒక మహిళ(38) మెడలో నుండి రాయికల్ పట్టణం ఇందిరానగర్ కి చెందిన పడిగెల రాజేష్(28) అనే వ్యక్తి బంగారు గొలుసు దొంగతనం చేయడానికి యత్నించగా , ఆమె గట్టిగా కేకలు వేయడంతో చుట్టూ ప్రక్కల ఉన్న యువత అతడిని పట్టుకొని పోలీస్ వారికి అప్పజప్పడం జరిగింది . మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయనైనదని ఎస్సై అజయ్  తెలిపారు.