Bandi Sanjay bail బండి సంజయ్‌కి బెయిల్

Bandi Sanjay bail బండి సంజయ్‌కి బెయిల్

పేపర్ లీక్ కేసులో అరెస్టైన TS BJP చీఫ్ బండి సంజయ్‌కి బెయిల్ లభించింది. నిన్న సంజయ్‌కి హన్మకొండ మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించడంతో ఆయనను కరీంనగర్ జైలుకు తరలించారు. అయితే బీజేపీ లీగల్ సెల్ టీమ్ సంజయ్ తరఫున హన్మకొండలో బెయిల్ పిటిషన్ వేసింది. దీనిపై 8 గంటల సుదీర్ఘ విచారణ తరవాత ఇద్దరు వ్యక్తుల హామీ, రూ.20 వేల పూచీకత్తుతో జడ్జి కండిషనల్ బెయిల్ మంజూరు చేశారు. దీంతో రేపు ఆయన విడుదలకానున్నారు.