మంచిర్యాల లో ఘనంగా బక్రీద్

మంచిర్యాల లో ఘనంగా బక్రీద్

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల : మంచిర్యాల లో బక్రీద్ పర్వదినం వేడుకలను ముస్లీమ్ లు భక్తి శ్రద్దలు, ఆనందోత్సవాల మధ్య ఘనంగా జరుపుకున్నారు. గురువారం ఉదయం దర్గాలకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. ఆర్టీసీ బస్టాండ్, ఏసీసీ క్వారీలోని ఈద్గాల వద్ద ముస్లీమ్ లు ప్రార్థనలు జరిపి ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఎమ్మెల్యే నడిపెళ్లి దివాకర్ రావు, మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, వైస్ చైర్మన్  గాజుల ముకేశ్ గౌడ్ ఈద్గాల వద్దకు వెళ్లి ముస్లీమ్ లకు శుభాకాంక్షలు తెలిపారు.