సింగరేణి ప్రయివేటు పరంకు కుట్ర- సీసీసీ మహా ధర్నాలో బాల్క సుమన్

సింగరేణి ప్రయివేటు పరంకు కుట్ర-  సీసీసీ మహా ధర్నాలో బాల్క సుమన్

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల : సింగరేణి సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి కార్మికునిపై ఉందని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. సీసీసీ పెట్రోల్ బాంక్ వద్ద ఏర్పాటు చేసిన మహా ధర్నాలో బాల్క సుమన్ ప్రసంగించారు. సింగరేణి లోని బొగ్గు బ్లాకులను ప్రైవేటీకరణ చేయడానికి కేంద్రం కుట్ర చేస్తోందని ఆరోపించారు. కేంద్రం ఎన్ని కుయుక్తులు చేసిన తెలంగాణ కు గుండెకాయలాంటి సింగరేణిని కాపాడుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ   విద్యార్హత వివరాలు గోప్యంగా ఉంచవలసిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. మహాధర్నాలో దేవాదాయ ధర్మాదాయ, అటవీ, న్యాయ శాఖల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మంచిర్యాల, బెల్లంపల్లి, ఎమ్మెల్యేలు నడిపెళ్లి దివాకర్ రావు, చిన్నయ్య, మంచిర్యాల, ఆసిఫాబాద్ జడ్పి చైర్ పర్సన్ లు భాగ్యలక్ష్మి, కోవ లక్ష్మీ, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్, మాజీ మంత్రి జోగు రామన్న ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, బీఆరెస్ నేతలు పాల్గొన్నారు.