రేపు బాసర ఆలయం మూసివేత..

రేపు బాసర ఆలయం మూసివేత..

బాసర, ముద్ర : నిర్మల్ జిల్లా బాసర సరస్వతీ అమ్మవారి ఆలయం రేపు అనగా ఈ నెల 28వ తేదీన మూసివేయనున్నట్లు ఆలయాధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. శనివారం చంద్రగ్రహణం సంభవించనుండగా, మధ్యాహ్నం మహా నివేదన, హారతి అనంతరం అమ్మవారి ఆలయంతో పాటు అన్నీ ఉపఆలయాలు ద్వారబంధనం చేయనున్నామన్నారు. తదుపరి ఆదివారం ఉదయం 4 గంటలకు అన్నీ ఆలయాల ద్వారాలు తీసి మహా సంప్రోక్షణ, అమ్మవార్లకు సుప్రభాతం, అభిషేకం అన్నీ ఆర్జిత సేవలు ప్రారంభిస్తామని తెలిపారు..