పేద ప్రజల సౌకర్యర్తమై బస్తి దవాఖాన..

పేద ప్రజల సౌకర్యర్తమై బస్తి దవాఖాన..

అందరు సద్వినియోగం చేసుకోవాలి - రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

ఖానాపూర్, ముద్ర : పేద ప్రజల సౌకర్యం కోసం అందరికి అందుబాటులో ఉండాలనే ఉద్దేశ్యంతో బస్తి దవాఖాన ఏర్పాటు చేయటం జరిగిందని రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే రేఖానాయక్ లు అన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ పరిధిలోని గాంధీనగర్ లో శుక్రవారం బస్తీ దవాఖాన, ఆయుష్షుమాన్ అర్బన్ హెల్త్ నెస్ సెంటర్ ను ఆయన ప్రారంభం చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ,  రూ. 13 లక్షలతో ఏర్పాటు చేయటం జరిగిందని, పి హెచ్ సి సెంటర్ ల మాదిరిగానే పని చేస్తుందని, ఇందులో ఒక డాక్టర్, కాపౌoడర్, బ్లడ్ టెస్ట్ లు చేసే సిబ్బంది ఉంటారని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీర్ హైదరాబాద్ లో తొలిసారిగా ప్రారంభం చేసిన విషయం గుర్తు చేశారు. ప్రజల పక్షాన పనిచేసేది బి ఆర్ ఎస్ ప్రభుత్వం మాత్రమే అని అన్నారు. కార్యక్రమం లో మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్, వైస్ చైర్మన్ ఖలీల్, పిఎసిఎస్ చైర్మన్ లు ఆమంద శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి, నాయకులు రాజగాంగన్న, ద్యావతి రాజేశ్వర్, ఆకుల వెంకగౌడ్, వైద్య శాఖ అధికారులు, స్థానికులు పాల్గొన్నారు.