ఓసీపీ లతో కొలువులకు కొరత

ఓసీపీ లతో కొలువులకు కొరత
  • స్థానికేతరులకు ఉద్యోగాలు ఎలా ఇస్తారు ?
  • ప్రభుత్వాన్ని నిలతీసిన భట్టి

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల : 

 సింగరేణి లో ఓపెన్ కాస్ట్ గనులతో ఉద్యోగ, ఉపాధికి విఘాతం కలుగుతు, పరిసర ప్రాంతాలు బొందల గడ్డగా మారుతున్నాయని సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం పాదయాత్ర సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖతో కలిసి ఓసీపీ గనులను జ్పరిశీలించారు. ఈసందర్భంగా భట్టి మాట్లాడుతూ, ఓసీపీ లతో తీవ్రంగా నష్టపోయినట్లు బాధితులు తన వద్ద వాపోయినట్లు తెలిపారు. భూగర్భ గనుల తవ్వకాలు జరిపితే స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వచ్చేవని అన్నారు. సింగరేణి గనులను ప్రయివేట్ సంస్థలకు అప్పగించడం వల్ల ఉద్యోగాలు కోల్పోవల్సి వచ్చిందని ఆయన తెలిపారు. ఓపెన్ కాస్ట్ కాంట్రాక్టర్ అధికార పార్టీపై చెందిన చల్లా ధర్మారెడ్డి సంబంధీకులదని ఆయన ఆరోపించారు. ఆ సంస్థ స్థానికేతరులకు ఉద్యోగాలు ఇవ్వడంతో స్థానికులు నిరుద్యోగులుగా మారారని ఆయన ధ్వజమెత్తారు. సింగరేణి యాజమాన్యం స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని భట్టి భరోసా ఇచ్చారు. ఇదిలావుండగా దుబ్బపల్లి నుంచి ప్రారంభమైన పాదయాత్ర శ్రీరాంపూర్లోని ప్రగతి స్టేడియంకు చేరుకుంది.