సర్వర్లు డౌన్ మిగిలింది మూడు రోజులే

సర్వర్లు డౌన్ మిగిలింది మూడు రోజులే
  • సర్వర్లు డౌన్ మిగిలింది మూడు రోజులే
  • బిసి చేతి కులవృత్తుల దరఖాస్తులు 
  •  గడువు పొడిగించాలంటున్న దరఖాస్తుదారులు
  •  ఆందోళన చెందద్దు తాసిల్దార్ జయంత్ కుమార్ 

 ముద్ర,ఎల్లారెడ్డిపేట:రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల  తహసిల్దార్ కేంద్రంలో బిసి కులవృత్తుల దరఖాస్తులు వేల సంఖ్యలో దరఖాస్తుదారులు నమోదు చేసుకున్న సమయంలో కంప్యూటర్ సర్వర్ డౌన్ కావడంతో ధ్రువీకరణ పత్రాలు ఆలస్యం అవుతున్నాయని బీసీ కులవృత్తుదారులు  ఆందోళన చెందుతున్నారు.  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బిసి కులవృత్తులకు లక్ష  సహాయం అందిస్తామని ఈ నెల 20 వరకు  గడువు ఇచ్చింది.  మూడు రోజుల్లో గడువు ముగుస్తున్న నేపథ్యంలో  దరఖాస్తుదారులు  బారులు కడుతున్నారు. ఆదాయ ధ్రువీకరణ పత్రాలు చేతికి అందడంలో ఆలస్యం అవుతుందని వాపోతున్నారు. అదేవిధంగా చేనేత వృత్తులకు మొదటగా కులవృత్తుల జాబితాలో చేర్చలే చేనేత కార్మికులు ఆందోళన వ్యక్తం చేయడంతో గత మూడు రోజుల క్రితం చేనేత వృత్తులను కూడా ఇదే జాబితాలో చేర్చడంతో దరఖాస్తుదారులు  వేల సంఖ్యలో దరఖాస్తు చేసుకుంటున్నారు.  ఆదయ దృవీకరణ పత్రాలు ఆలస్యమైతున్న నేపథ్యంలో  తహసిల్దార్ జాంత్ కుమార్ ను వివరణ కోరగా దరఖాస్తుదారులు వేల సంఖ్యలో వస్తున్నారని తమ సిబ్బంది రాత్రింబవలు అందుబాటులో ఉండి ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అందజేస్తున్నామని సర్వర్ డౌన్ కావడంతో కొంత ఆలస్యమైన విషయం నిజమేనని దరఖాస్తు చేసుకున్న ప్రతి వ్యక్తికి ఆదాయ ధ్రువీకరణ పత్రం అందజేస్తామని ఆందోళన చెందవద్దని సూచించారు.