ప్రగతి భవన్ ముట్టడిస్తాం

ప్రగతి భవన్ ముట్టడిస్తాం
  • ఏ ఐ ఎస్ ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠ

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల: తెలంగాణ ప్రభుత్వం విద్యారంగ సమస్యలు, ప్రభుత్వ హాస్టల్ సమస్యలను పరిష్కరించకపోతే ప్రగతి భవన్ ముట్టడిస్తామని ఏ.ఐ. ఎస్.ఎఫ్.రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ స్పష్టం చేశారు. మంగళవారం మంచిర్యాల జిల్లా ఏ ఐ ఎస్ ఎఫ్ జిల్లా కమిటీ సమావేశంకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం విద్యారంగంను నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. పెండింగ్ లో ఉన్న ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్ మెంట్ మూడేళ్ళ నుంచి చెల్లించడం లేదని మండిపడ్డారు. ధీంతో నిరుపేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారని తెలిపారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్ లో విద్యార్థులకు మెస్, కాస్మొటిక్ చార్జీలు పెంచామని ప్రకటన చేశారు తప్ప ఇప్పటి వరకు ఆచరణలో అమలు చేస్తున్నట్లు జీ.ఓ విడుదల చేయలేదని ఆరోపించారు. హాస్టల్స్ కు నిధులు విడుదల చేయడం లేదని మరోవైపు వార్డెన్లు వాపోతున్నారని ఆయన చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈసమావేశంలో జిల్లా కార్యదర్శి సన్నిగౌడ్, పట్టణ కార్యదర్శి రేగల సిద్దార్థ్, నాయకులు కుతుబ్, సాయికుమార్, జతిన్, మండల శాఖ అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.