తుంగతుర్తి మెయిన్ రోడ్డుపై ఏర్పడ్డ పెద్ద గుంత

తుంగతుర్తి మెయిన్ రోడ్డుపై ఏర్పడ్డ పెద్ద గుంత
  • వాహరదారులకు ఇబ్బందులు ఇప్పటికే పలువురు వాహనదారులకు గుంతలో పడి గాయాలు
  • తక్షణమే గుంతలు పూర్తి చేయాలని అధికారులు కోరుతున్న ప్రజలు


తుంగతుర్తి ముద్ర:- అనునిత్యం రద్దీగా ఉండే తుంగతుర్తి మెయిన్ రోడ్డుపై స్థానిక బస్టాండ్ ఎదురుగా పెద్ద గుంత ఏర్పడి వాహనదారులకు తీవ్ర ఇబ్బందిగా మారింది. ఇదే రోడ్డుపై నుండి అటు అధికారులు ఇటు ప్రజాప్రతినిధులు ప్రతిరోజు తిరగడం జరుగుతుంది. అయినా లోతుగా ఏర్పడిన గుంతలు ఎవరూ పట్టించుకోకపోవడంతో పగటిపూట వాహనదారులు గుంతను చూసి పక్కనుండి వెళ్తున్నారు .రాత్రిపూట ప్రయాణించే వాహనదారులు తమ వాహనాల గుంతలో పడి దెబ్బలు తగిలి ఆసుపత్రుల పాలవుతున్నారు. నియోజకవర్గ కేంద్రంలో మెయిన్ రోడ్డుపై  పెద్ద గుంత ఏర్పడడం దానిని ఎవరూ పట్టించుకోకపోవడం పట్ల స్థానికులు ఆగ్రహం, ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే గుంతలు పూడ్చివేసే ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.