మంత్రి ఇంద్రకరణ్ కు బిగ్ షాక్ మండల పరిధి నిరసిస్తూ రాజీనామాలకు సిద్ధం

మంత్రి ఇంద్రకరణ్ కు బిగ్ షాక్ మండల పరిధి నిరసిస్తూ రాజీనామాలకు సిద్ధం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నూతన మండలాల ఏర్పాటు, పరిధిని నిర్ణయించటం ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రభుత్వ తీరును ఖండిస్తూ మూకుమ్మడిగా రాజీనామా చేసేందుకు సారంగాపూర్ మండలం మలక్ చించోలి గ్రామ ప్రజా ప్రతినిధులు రాజీనామాలకు సిద్ధం అయ్యారు. ఇందులో భాగంగా ఆదివారం రాస్తారోకో నిర్వహించారు. మలక్ చించోలి గ్రామాన్ని 2 నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న సారంగాపూర్ మండలం నుంచి వేరుచేసి12 కిలోమీటర్ల దూరంలో ఉన్న నూతన  మండలం బీరవెల్లిలో కలుపుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయంపై నిరసన తెలుపుతూ గ్రామస్థులు, ప్రజా ప్రతినిధులు ఈ రాస్తారోకోలో పాల్గొన్నారు. మండల పరిధి మార్పు పై ప్రభుత్వం వెనక్కి తగ్గకుంటే మూకుమ్మడిగా గ్రామానికి చెందిన ప్రజా ప్రతినిధులు మొత్తం రాజీనామా చేస్తామని హెచ్చరించారు.