బిజెపి కి భారీ షాక్ పార్టీని వీడనున్న జిల్లా అధ్యక్షురాలు రమాదేవి

బిజెపి కి భారీ షాక్  పార్టీని వీడనున్న జిల్లా అధ్యక్షురాలు రమాదేవి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: బిజెపి లో టికెట్ల కేటాయింపు జరగటంతో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. తనకు టికెట్ రాకపోవటంతో పార్టీ జిల్లా అధ్యక్షురాలు పడకంటి రమాదేవి పార్టీ అధ్యక్ష పదవితో పాటు ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేయనున్నట్లు విలేకరుల సమావేశంలో ప్రకటించారు. ఈ సమావేశంలో ఆమె కన్నీటి పర్యంతం అయ్యారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ టికెట్ కేటాయింపులో తనకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు కన్నీటి పర్యంతం అవుతూ పార్టీ కోసం ఎంతో కృషి చేసిన తనకు బిజెపి చేసిన ద్రోహం తట్టుకోలేక పోతున్నట్లు వాపోయారు. ముథోల్ నియోజక వర్గ ప్రజల తోడ్పాటుతో వచ్చే నెలలో జరుగనున్న ఎన్నికల్లో పోటీ చేస్తానని తెలిపారు. దశాబ్ద కాలంగా హైదరాబాద్ లో ఉంటున్న తన కుటుంబాన్ని వదిలి బీజేపీ పటిష్టత రేయింబవళ్లు పాటు పడ్డానని పేర్కొన్నారు. ముథోల్ నియోజక వర్గ ప్రజా సేవలో అవిశ్రాంతంగా శ్రమించానన్నారు. అంకితభావంతో త్యాగాలతో వ్యవహరించిన తనకు టికెట్ కేటాయింపు విషయంలో పార్టీ తీరని అన్యాయం చేసిందన్నారు. జిల్లా అధ్యక్షురాలికి  కనీస  సమాచారం కూడా ఇవ్వలేదన్నారు. ఇలాంటి పార్టీకి సరియైన రీతిలో గుణపాఠం నేర్పక తప్పదన్నారు. పార్టీకి రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు. అనుచరులు, ఆత్మీయులతో సమాలోచనలు, సమావేశాలు నిర్వహించి రెండు రోజుల్లోగా రాజకీయ భవిష్యత్తు కార్యచరణ ప్రణాళిక ప్రకటిస్తానన్నారు.